2) తెలంగాణ వాళ్ళు చేస్తున్న పోరాటం, వాళ్ళకోసమే. వీధినపడి ధర్నాలు చేస్తున్న సమైక్యవాదులు చేసే పోరాటం కూడా, వారి స్వప్రయోజనాల కోసమే
3) మా ప్రాంతం వెనకబడిందంటే, కాదు మాది మాదంటూ, ఇలా వెనుకబాటుతనంలో పోటీ పడుతున్నామంటే, అసలు అభివృద్ధిని ఆకాంక్షించే అర్హత మనకుందా?
4) “ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకునేది మా పార్టీ” అని ఈరోజు ప్రతీ పార్టీ చెప్తోంది. ఇలా ఆలోచించే వాళ్ళు అసలు లీడర్సు, పాలసీ మేకర్స్ ఎలా అవుతారు?
5)* ప్రజలు బద్దకస్థులు. ప్రస్తుత కాలంలో విద్య, రాజకీయాలు, ఈ రెండూ పనికిరాని కుళ్ళిపోయిన వ్యవస్థలు. ఉస్మానియా అయినా, ఆంధ్ర విశ్వవిద్యాలలయమైనా, మరేదైనా, అవినీతి పంకిలాలు*. విద్యార్ధులతో సహా! ఎవడు సరిగ్గా చదివి పాసయ్యాడు? సరిగ్గా క్లాసులకి హాజరౌతాడు? హాస్టల్స్ లో జరిగే అసాంఘిక కార్యకలాపాలకు అసలు లెక్కేదీ? ఈ వ్యవస్థలో ఎవెరు నీతిమంతులు, నిజాయితీపరులు? ఇందులోంచీ పుట్టిన ఉద్యమాలు ఎంత పవిత్రం. (అది ఓ.యూ తెలంగాణా అయినా, ఏ .యూ సమైక్యాంధ్రా అయినా).
6) ప్రతీ మనిషి ప్రభుత్వం మీదే ఆధారపడాలనే పరాధీన మనస్తత్వం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూసి మోసపోవడమే ప్రస్తుత సమాజ దుస్థితి.
ప్రజలచేత, ప్రజలకోసం, ప్రజల కొఱకు ఏర్పడిన వ్యవస్థ ఒక పరిష్కారం చూపలేకపోయింది అంటే అది ఎవరి లోపం.
దానికి మూల స్తంభాలైనప్రజల స్వార్ధానిదా? అందులోంచి పుట్టి, ప్రజల అభిప్రాయమని, పార్టీ గతి-గమ్యాలని గాలివాటంగా మార్చే, రాజకీయనాయకులదా?
యథా ప్రజా - తథా రాజా
ఉదాహరణకి,
గ్రామీణ వెనుకబాటు లో అగ్రస్థానం ఏ జిల్లాదో తెలుసా?
ఒకప్పటి ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని విజయనగరం. ఈ జిల్లా కాంగ్రెసు మంత్రి కుటుంబం నుంచి నలుగురు వ్యక్తులు శాశన సభ్యులు లేదా పార్లమెంటు సభ్యులు. జిల్లా ఎంత వెనుకబడిందో, వీరి ప్రైవేటు ఆస్తులు అంత వృద్ధి చెందాయి. ప్రజలారా కళ్ళు విప్పండి.
ప్రజలు మారితే, పాలకులు మారతారు.
పాలకులు మారితే పాలన మారుతుంది.
దీని కోసమే కదా ఉద్యమాలు. లేని పక్షంలో,
తిరోగమనానికి మరిన్ని కొంగొత్త కారణాలకై నిరంతర అన్వేషణ కొనసాగుతుంది
* ఇది కొంతమందిని బాధించే విషయమైనా, సత్యదూరం కాదు.
6 కామెంట్‌లు:
Chaala baaga chepparandi....
చాలా బాగా చెప్పారు
good
great job
well said
"ఏ ప్రాంత ప్రజలైనా స్వార్ధపరులే..."
అవును, ఉద్యమాలు జరిగేవే స్వప్రయోజనాల సిద్ధి కోసం. పరోప కారానికి కాదు. మరి మన ప్రయోజనాల కొరకు ఇతరులను సమైక్యంగా ఉండాలని కోరడం ఎంతవరకు సబబు?
@hari dornala: What you asked is a very sensible question. I am sure you know the answer but I will give a try.
Selfishness is needed for development. We want to grow as an individual, as a society, as a state, as a nation. Often times, these aspirations are mutually conflictig. Sacrifice, adjustment and understanding, will determine the aspirations that can be fulfilled. In a union, with few sacrifices, sum can be greater than the parts.
Telangana case is really complex. I assume that everyone is well acquainted with the rhetoric, so I will not get into it. But my short answer is:
While the udyamam's intentions are noble, the solution sought may not achieve the objective.
It is based on the following hypothesis:
A new state necessarily inherits all the features of a failed model, defeating the very purpose of starting the udyamam in the first place.
Further more, not forming a state will have lesser repercussions.
That essentially means maintaining status-quo. But something has to be done to quell the fire.
I will elaborate it in my next posts.
and thanks to all those responded.
Nice one !
కామెంట్‌ను పోస్ట్ చేయండి