21, మార్చి 2009, శనివారం

రేయి మించెనోయీ రాజా (పేరడీ video)

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ .....హాయిగ నిదురించరా

వెన్నెల్లు విరెసె, వెతలెల్ల వెలిసె
ఆశల తారలు మిలమిల మెరిసె

తలపుల్లో నీవు, జలకమ్ములాడి
విందారగింపా విచ్చేయవోయి
మమతల్లు కలుపు, మాయల్లు విరుపు
దూరాలు తరగు, మురిపాలు పెరుగు
హాయిగ నీవింక సేవించవోయీ

రేయి ||

సిరులూ, విరులూ, మనకేలనోయి,
రాగం, అనురాగం మనవేకదోయి

కన్నుల్లు మూసి, మనసే తెరచి
కలలేకంటూ విహరించవోయీ
హార్ధికమాంద్యం కలలకుకాదు
కలలకు కొఱతంటు రానేరాదు
హాయిగ నీవింక శయనించవోయి

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ .....హాయిగ నిదురించరా
ఉమ్.....ఊమ్..... ఊ....ఊ.......


ఈపాట వీడియో రూపంలో ఇక్కడ చూడండి



రచన: దీపిక ఆచళ్ళ, సోమశేఖర్ ధవళ
గాత్రం: దీపిక ఆచళ్ళ
స్వరకల్పన: ఘంటసాల
మాతృక రచన: సముద్రాల
చిత్రం: శభాష్ రాముడు


నేపధ్యం:
నేను, దీపిక (మా ఆవిడ) కలిసి సాయంత్రం "నడక" కని బయలుదేరాం (ఇలా వాకింగ్ కి వెళ్ళడం, జీవితంలో నాకు ఇదే మొదటిసారి). కాస్త దూరం నడిచిన తరువాత, ఏదైనా పాటపాడొచ్చు కదా అని దీపికని ఆడిగాను. సరే అయితే, మీకిష్టమైన "శభాష్ రాముడు" లోని "రేయి మించెనోయి రాజా" పాడతాను అని మొదలుపెట్టాకా, ఇంక ఆపాటకి పారడి మొదలుపెట్టాను (నాకు అంత్యాక్షరీల్లో, ఇలా పాటలని ఖూనీ చెయ్యడం బాగా అలవాటూ). అది ఇలా మొదలయ్యింది

"అలసి సొలసి, ఆయాసం వచ్చి,
త్వరగా ఇంటికి పోదామురండి" అని మాఆవిడ అంటే


"పోపే పోచి, చారే కాచి
వేడిగా ముద్దే తిందాము రండి" అని నేను,

ఇలా కామెడీగా మొదలయ్యి, పైన రాసిన విధంగా రూపాంతరం చెందింది.

20, మార్చి 2009, శుక్రవారం

మా బాబె, అచ్చం "రాజా" లాగె

మా బాబె, అచ్చం "రాజా" లాగే అన్న సాక్షి
ప్రభుభక్తి పొరలు కమ్మిన కళ్ళు చిదిమి చూస్తే



మా అసహాయత, అశక్తత, అనాశక్తతలే
మీ ఓట్ల, నోట్ల కోటలకి
తిరుగులేని, ఎదురులేని, ఎదురేలేని పెట్టుబడులని

అందుకు మా ఎదుగులేని, బొదుగులేని
బడుగు బ్రతుకులె
సాక్షులని
తెలియకపోదు

19, మార్చి 2009, గురువారం

4, మార్చి 2009, బుధవారం

3, మార్చి 2009, మంగళవారం

ఆలోచనల కాలుష్యం

మనసు కలుషితమైతే సరైన నిర్ణయాలు తీసుకోలేదు. మరి పరిష్కారం: విచక్షణ, క్షమ, ఓర్పు, సహానుభూతి అనే వడపోత కాగితాలతో వడకట్టండి. ఈ భావాన్ని ప్రతిబింబింస్తూ స్ఫురింపజేస్తూ, తయారు చేసిన ఒక 50s ల లఘువీడియో క్రింద చూడండి:

ఒక మూడు సంవత్సరాల క్రితం, విధ్యార్ధిసంఘం ఎన్నికల సందర్భంలో, war of the videos లో భాగంగా, ఒక 10 పది నిముషాలు చిత్రీకరణకి, ఒక 10 నిముషాలు కూర్పుకి "కష్టపడి" చేసిన వీడియో ఇది :) మళ్ళీ లోక్ సభ, శాశన సభ ఎన్నికలు సమీపుస్తున్నతరుణంలో ఇలా!

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును