21, డిసెంబర్ 2009, సోమవారం

సమైక్యాంధ్ర ఉద్యమ నిర్వహణలో లోపాలు

సమైక్యాంధ్ర కోసం ఉద్యమం*: ఎందుకు ఎవరితొ, ఎక్కడా, ఎలా?

ఎందుకు:
సగం మంది దగ్గర సమాధానం ఉండదు. (విడిపోవడానికి చెప్పినంతా సులువుగా, కలిసుండడానికి కారణాలు చెప్పడం కష్టం. ఋజువుల సంగతి సరే సరి. ఉదాహరణకి: అణచివేత, వివక్ష, దోపిడీ, ఆత్మగౌరవం. ఎలాంటి వారు విడిపోవడానికైనా, ఈ కారణాలు చెప్తే చాలు కదా!)


ఎవరితో:
మాతో సమైక్యంగా ఉండండని, ఉండగోరే వాళ్ళతో పోరాటం. ఎంత విచిత్రం

ఎక్కడ:
తెలంగాణా వాళ్ళతో సఖ్యతకోసం, సీమ - కోస్తాల్లో. మరీ విచిత్రం

ఎలా:
కొబ్బరి చెట్లు ఎక్కి, శవదహనాలు చేస్తూ, పిండాలు పెడుతూ, పాలాభిషేకాలతో, రైళ్ళు-బస్సులు-సమస్తం - ధ్వంసం చేస్తూ, అర్ధ-నగ్న ప్రదర్శనలు చేస్తూ --
(ఇలాంటి విడ్డూరాలకి మనం అలవాటుపడిపోయాం. తెలంగాణా వాదుల "జాగో-భాగో, " లు తక్కువేమీ కాదనుకోండీ)

ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తోంది. సమైఖ్యతా భావన సడలిపోవడానికి ఇంతకన్నా వేరే కారణాలు కావాలా?


* ఈ టపా బ్లాగుల్లో జరుతున్న చర్చలని దృష్టిలో పెట్టుకుని రాసినిది కాదని మనవి

3 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

బాగా రాసారండీ.
ఆంధ్రజ్యోతి లో రంగనాయకమ్మగారు తెలంగాణ మీదా రాసిన వ్యాసం చూసారా?

http://venuvu.blogspot.com/2009/12/blog-post.html

మాదీ విజయనగరమే

అసంఖ్య చెప్పారు...

@alamuru: nice meeting you :).

I find faults in both sides of the udyamas and their approach.

It is not just black & white as people see it.

Sadly, both parties go at each other, blindly supporting one side.

ఆ.సౌమ్య చెప్పారు...

ఉద్యమపోరాటానికొస్తే

కలిసిఉందాం అని ఉద్యమం సాగించడం హాస్యాస్పదంగా ఉంది.

చరిత్ర తెలిసిన ఎవరు కూడా తెలంగాణాని వ్యతిరేకించరు.....పదవులకి, డబ్బులకి అమ్ముడుబోయిన నేతల మధ్య కె.సి.ఆర్ నాయకుడిగానే నిలిచాడు. But I personally don't have a good opinion about KCR.

ఇప్పటి ఉద్యయం 50 యేళ్ళగా వస్తున్న ఉద్యమంతో పోలిస్తే చాలా ఎత్తున ఉంది. ఒకప్పుడు 'తెలంగాణా' రాజకీయనాయకుల ఆశ, ఇప్పుడు అది ప్రతీ తెలంగానా పౌరుడి ఆకాంక్ష. వద్దు విడిపోతాం అన్న వాళ్ళని బలవంతంగా కట్టిఉంచడం సమంజసం కాదు.

అభివ్రుధి విషయానికొస్తే తెలంగాణాకి ఉన్న పరిస్థితే ఇంకా చాలచోట్ల ఉంది మన ఆంధ్ర ప్రదేశ్ మొత్తంలో. ఎక్కడో ఎందుకు మా ఉత్తరాంధ్ర లొనే విజయనగరం, శ్రీకాకుళంలను వెనుకబడిన జిల్లలుగానే ఇప్పటికి గుర్తిస్తున్నారు. మా గోడు ఎవరితో చెప్పుకోవాలి.అటు మా ఊళ్ళలోనూ అభివ్రుధి లేక ఇటు హైదరాబాదు దక్కకపోతే మాలాంటి వాళ్ళందరు ఎక్కడికి పోవాలి అనేదే ఆలోచన. "అది తెలంగాణాకి వ్యతిరేకం కాదు." కానీ మనసులో ఎక్కడో, ఏదో ఓ మూల హైదరాబాదు మీద వెర్రి ఆశ చావట్లేదు.అందరికి సమపాళ్లలో దక్కల్సిన హైదరాబాదు పోతుందన్నందే బాధ. వేరే రాష్త్రాల రాజధానిలో ఉండలేమా అంటే ఎంత సౌకర్యవంతంగా ఉండొచ్చో అందరికి తెలుసు. స్థానబలం అన్న అంశం గురించి ఎవరికి తెలియదు.

ఇప్పుడు సీమాంధ్ర ఉద్యమం చేస్తున్న నాయకులంతా కూడా హైదరాబాదును ద్రుష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. వాళ్ల వాళ్ల పెట్టుబడులకు ఉన్న నష్టం గురించే అలోచన. కానీ ఈ రాజకీయనాయకులు, విద్యార్ధులు చేస్తున్న ఉద్యమం మాత్రం సరి అయినది కాదు. జనజీవనం స్థంబించిపోవడమన్నది శోచనీయం.

ఎప్పుదు కావలిస్తే అప్పుడు విడిపోవచ్చు అన్న షరతుమీదే తెలంగాణా ఆంధ్రలో విలీనం అయ్యింది.వద్దు మొర్రో అంటున్నవాళ్లని కట్టి ఉంచడం సమంజసం కాదు. అది సఖ్యతను చాటుకోదు. ఒకవేళ ఇప్పుడు తెలంగాణా రాకపోయినా భవిష్యత్తులో సీమాంధ్ర తెలంగాణా ప్రజలు భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్నంత శత్రుత్వంతో కలిసి బ్రతకాల్సివస్తుంది. అది ఎవరికి మంచిది కాదు. కలిసిఉంటేనే అభివ్రుధి సాధిస్తాం అన్నది అర్థం లేని మాట.

ఇంకొకటి...ఇంతటి అతి పేద్ద ప్రజాస్వమ్య భారతదేశంలో ప్రజాభిప్రాయానికి విలువలేదు. అసలు ఈ గొడవలన్నీ మానేసి ఓటింగు పెడితే సరిపోతుంది కద. ఎంతమంది తెలంగాణా కావాలనుకుంటున్నారు, ఎంతమంది వద్దనుకుంటున్నారు అనేది ప్రజాముఖంగా తెలిస్తే సమస్య చిక్కులేకుండా విడిపోతుంది. అసలు అలాంటి సిస్టం మనకిలేనేలేదు. అటువంటి దాన్ని గురించి ఎవరూ ఆలోచించరు కూడా.

ఇలా పోతూ మనం ఎక్కడ తేలుతామో !

By the way నా పేరు సౌమ్య

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును