22, డిసెంబర్ 2009, మంగళవారం

ప్రొఫెసర్. జయశంకర్: మీ వెన్న దొంగ ఎవరు?

కె.సీ.ఆర్ మాటల్లో, ఒక తెలంగాణలో స్కూలు పిల్లవాడినడిగినా చెబుతాడు, "మనకి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు చెప్పరా" అంటే, ఇలా
1) తెలంగాణా కి అన్యాయం జరిగింది.
2) భాషను గేలీ చేసేరు.
3) జాతి ని అవమానించేరు.
4) వివక్ష చూపేరు.
5) దురాక్రమణ దారులు శతాబ్దాలుగా దోచుకుతింటున్నారు
...... అంటూ మరెన్నో

ఒక తెలంగాణా చరిత్రకారుణ్ణి అడిగితే,
నాలుగువందల పైచిలుకు సంవత్సరాలుగా, బానిసత్వంలో బతికాం. పాలకుల దాష్టీకానికి గురైన బంగారు పిచుక తెలంగాణా. పోరాటాల పురిటి గడ్డా మా తెలంగాణా + పై పిల్లాడి కారణాలు

ఒక కళాకారుడ్ని అడిగితే,
డప్పుతో దరువేస్తూ, లయబధమైన గజ్జెల జప్పుడుతో,
ఎవడురా, ఎవడురా,
తెలంగాణకు అడ్డెవడురా, + పై పిల్లాడి కారణాలు
అని పాడుతుంటే, ప్రాంతాలకతీతంగా ఎవరికైనా ఉద్రేకం కలుగుతుంది. పోరాట స్ఫూర్తి రగులుతుంది. మేము కూడా పలుపంచుకుంటాం అనాలనిపిస్తుంది. కదా?

పై చెప్పినవాటినే మరొక్కసారి పరీక్షిద్దాం.
-- [ ... నాలుగువందల పైచిలుకు సంవత్సరాలుగా, బానిసత్వంలో బతికాం ...]
-- [ ... పోరాటాల పురిటి గడ్డా మా తెలంగాణా ...]
-- [... ఎవడురా, ఎవడురా,
తెలంగాణకు అడ్డెవడురా ...]

ఇలా నాలుగువందలేళ్ళుగా, పోరాడుతునే వున్నాం. మళ్ళీ పోరాడుతునే వున్నాం.
కానీ ఎవరితో? ఇంకా ఎన్నాళ్ళు? వీటిలో వైఫల్యం ఎవరిది?

ప్రొఫెసర్. జయశంకర్ గారూ.
మనం మనతో పోరాడితే విజయం లభిస్తుంది. తద్వారా, సంఘమూ విజయం సాధిస్తుంది.
ఎదుటి వారితో పోరాడుతూ వుంటే, నిరంతరం పోరాడుతూనే ఉండవలసివస్తుంది. అంతర్గత పోరాటలతో, మహా సామ్రాజ్యాలూ, సంస్కృతులూ మట్టికొట్టుకొనిపోయాయి. పోరాటినికి సై సై అంటున్న సైనికుల భావ బానిసత్వంపై పోరాటం ప్రకటించండి, వారిని విముక్తుల్ని చెయ్యండి. అప్పుడు తెలంగాణ, సీమ, కోస్తాలే కాదు, ఆసేతుహిమాచలమూ కళ కళ లాడుతుంది.

దీన్ని
గాంధీ నిరాహారక్ష తేదు
నెహ్రూ పంచవర్షలు తేలేదు
ఇందిర ఇరవై సూత్రాలు తేనేలేదు
పి.వి. చాణక్యత తేదు
బూర్గుల కలంపోటు తేలేదు
చెన్నారెడ్డి వెన్నుపోటు తేనేలేదు

బాబు గారి ఐ.టి తేదు
వై.ఎస్.ఆర్ జల యఙ్ఞం తేలేదు
ఎన్.టీ.ఆర్ రెండు రూపాయలు తేనేలేదు

అంతే కాదు

జె.పీ స్వపరిపాలనతో రాదు.
చిరు పెను మార్పులతో రాలేదు
రోశయ్య బంట్రోతు బిళ్ళ తేదు
బాబు గారి మౌనం తేలేదు
లగడపాటి ధన యఙ్ఞం తో రాదు
కే.సీ.ఆర్ రాష్ట్ర విభజనతో రాలేదు
మీ సివిల్ వార్ ధంకీలతో అంత కన్నా రాలేదు.

ఒక్క సంస్కరింపబడిన విద్య ద్వారా మాత్రమే సాధ్యం. అటువంటి విశ్వవిద్యాలయాలు మనకి లేవు. వాటిని పోషించే పాలకులు లేరు. ఆ సంపదని అభివృద్ధి పరచే విద్యార్ధులు అసలే లేరు.

మీరు ఆ దిశగా చర్యలు చేపట్టండి.
జై తెలంగాణా అంటూ గొంతెత్తి నినదిస్తాం.
మీ కాలు మొక్కుతాం బాంచెన్

btw, who moved your cheese Prof. Jayashankar?
- ఒక సమైక్యవాది ప్రశ్న

5 కామెంట్‌లు:

jasmine చెప్పారు...

hareesh rao prasna ki javaabulu unnaayaa mana daggara???
see this video


http://www.youtube.com/watch?v=3k286v3uLv8

అజ్ఞాత చెప్పారు...

ఓయ్ హరీశ్ తెలంగాణాలో వచ్చిన ఆదాయం 90 % హైదరాబాదు ద్వారానే కదా!హైదరాబాదులో registrationలు జరగక పోతే ఆదాయమెక్కడిది?

అజ్ఞాత చెప్పారు...

హైద్రాబాద్ల కాలేజీలుంటే రంగారెడ్డి జిల్లాల కాలేజీలు గెట్లుంటయే

అజ్ఞాత చెప్పారు...

It ironic that Prof. Jayasanker studied economics and is a policy maker


For Some really refreshing perspectives on the Telangana backwardness, check these links

It is not some emotion crap but about real questions to be asked.

http://cosmicvoices.blogspot.com/2006/07/telangana-whose-cause-is-it-anyway.html


http://cosmicvoices.blogspot.com/2006/07/telangana-whose-cause-is-it-anyway.html

అజ్ఞాత చెప్పారు...

sorry wrong link

http://cosmicvoices.blogspot.com/2009/12/doubt-iv-telangana-revisited.html

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును