23, డిసెంబర్ 2009, బుధవారం

ఘోషయాత్రలో సమైక్యతారాగం - అరణ్య రోదన

who moved your cheese Prof. Jayashankar?

నా ప్రశ్న కి వివరణ


నేను తెలాంగాణా వెనుకబాటుతనంపై ఉద్యమాన్ని వ్యతిరేకించటంలేదు. అందుకు, మీరెంచుకున్న మార్గమేంటీ, చేరబోతున్న గమ్యమేంటి. ఈ ఉద్యమానికి రాజు కె.సీ.ఆర్ అయితె, ప్రొ. జయశంకర్ & కో మంత్రులు లాంటి వారు.

ప్రొ. జయశంకర్ గారు, వైస్ చాన్సలరు గానే కాకుండా అనేక ఉన్నత స్థానాల్లొ, విద్యాలయాలలకి సలహాలూ, సూచనలూ ఇచ్చిన వ్యక్తి. దశబ్దాలనుంచీ తెలంగాణా వెనుకబాటుతనంపై పోరాటం చేస్తున్న వ్యక్తి.

ఉద్యమం దారి తెప్పిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి సిద్ధాంత కర్త సిద్ధాంతాల్ని ప్రశ్నిస్తున్నాను. దీన్ని పొగరుబోతుతనం అన్నా పర్వాలేదు. ప్రశ్నినించే అర్హత, హక్కుల మాటకొస్తే, ఆం.ఫ్రా, నా రాష్ట్రం, ఇలా తగలబడిపోతూ ఉంటే, గళం విప్పడం నా బాధ్యత. ఒక విధ్యార్ధిగా ప్రశ్నించించడం నా ప్రాధమిక హక్కు. ప్రశ్నల్ని స్వాగతించడం ఆచార్యుల కనీస బాధ్యత.

సమైక్యత అంటే, తెలంగాణా ని విమర్శించడతనం కాదు. విభజన పరిహ్కారం కాదు అని భావిస్తున్నవాళ్ళ భావం. మీ నోటి కింద కూడు లాక్కునే దుర్మార్గపు ఆలోచనలు మాలాంటి సామాన్యులకి ఇంకా అబ్బలేదులెండి. దయచేసి ఇలాంటి పసలేని ఆరోపణలు చెయ్యకండి.

రాజకీయనాయకులు, కిలో రెండు రూపాయలు, ఉచిత విద్యుత్తు, భూమి పట్టాలు, కలర్ టీవీలు అంటూ ప్రజలని ప్రలోభపెట్టి వాళ్ళని సోమరిపోతులని చేస్తున్నాయి. రాష్ట విభజన. ఈ తాయిలాన్ని ఒక సిద్ధాంత కర్త ఆమోదించడాన్ని నేని ప్రశ్నిసున్నాను,

ఇంక విద్యార్ధులెన్ను కున్న మార్గాలు. ఓ.యూ లో ధర్నాలు, బస్సులు పగలగొట్టడాలూ. పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు, మిగతా ప్రాంత విద్యార్ధులు కూడా అదేపని. ప్రాంతాలకతీతంగా, పట్టుమని పదహారేళ్ళులేని ఆడ పిల్లలు, పరప్రాంత నాయకుల దిష్టిబొమ్మలని తగలబెట్టడం, వాటిని చెప్పులతో కొట్టడం. ఈ విష సంస్కృతిని మనం ఆదరిస్తున్నాం. అమ్మాయలపై రౌడీ మూకల ఏసిడ్ దాడులకి దీనికి మీకు సారూప్యత కనిపించడం లేదా? పెట్టిన కేసులు ఎత్తివేయాలని మరిన్ని ధర్నాలు. ఉద్యమాలు విద్యార్ధుల చేతిల్లోకి వెళ్ళిపోయిందని జబ్బలు చరుచుకోవడాలూ. అంటే, మనం ఇప్పటినుంచే చట్టాన్ని తుంగలా తొక్కే చట్టుబండ నాయకులని చప్పట్లు కొట్టి మరీ తయారు చేస్తున్నాము కదా?

ఇంతకీ అసలు ఏమి అభివృద్ధిని మీరు కాంక్షిస్తున్నారు. కోస్తా సీమాల్లో ఉన్న అభివృద్ధి ఒక మేడి పండు లాంటిది. కాలేజీలు కోస్తాలో ఉన్నన్ని లేవు అని ఎవరో అన్నారు. కాలేజీలు ఎలా నడిపిస్తారో మీకు తెలుసా. అధికారులని కొనేసి, అధ్యాపకులని అరువు తెచ్చుకొని, కాగితాలమీద నడిపిస్తారు. ఇలాంటి కాలేజీలు, చదువులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఈ విషయాయం మీ ఆచార్యవర్యులకు తెలీదనుకోవాలా? అందుకే విద్యరంగంలో నిపుణులైన మీ సిద్ధాంతకర్త గారి సిద్ధాంతాలని ప్రశ్నిస్తున్నాను.

విభజన ఒక మార్గం. మీరు పోరాడవలసిన అసలు సమస్య ఇది కాదు, అని నా విశ్వాసం. ఇది చెప్పడానికి సమైక్యవాదినే అవ్వాల్సిన అవసరం లేదు. ఏ భారతీయుడైనా, ఏ మానవుడైనా సూచించ వచ్చు. ఇది సార్వజనీనమైనది.

ఒక వేళ విభజన జరగాల్సిన పరిస్థితి వస్తే, దానికి రాజీ మార్గాలు ఎన్నుకోవాలి. ఎవ్వరూ తగ్గకుండా ఈ జఠిలమైన విభజనకి పరిష్కారం కుదరదు. అందుకు మీరు మానసికంగా సన్నిద్ధులు కండి. విభజన జరిగే పక్షంలో, ఈ మేడి పండు అభివృదిని కాకుండా నిజమైన అభివృద్ధిని కాంక్షించండి.
Replenish your think-tanks
Not just water tanks
ఒక సమైక్యవాదిగా ఇది నా అత్యాశ. నా మాటలు చాలమందికి రుచించవని నాకు తెలుసు. నా సిద్ధాంతాలు తప్పూ కావచ్చు.
ఘోషయాత్రలో సమైక్యతారాగం - అరణ్య రోదన
అన్నదే మీ అభిప్రాయమైనా , విచక్షణ ఉపయోగించి ఆలోచించండి. అది చాలు!

I opposed "dividing the state" Explained/Analyzed why. Suggested a compromise.

I accept any decision.

Peace out.

7 కామెంట్‌లు:

Anil Dasari చెప్పారు...

కంఠశోషే .. అయినా ఇలాంటి గొంతులు వినిపించాల్సిందే. బాగా రాశారు.

Sravya V చెప్పారు...

చాల చక్క గా చెప్పారు !

వాసు.s చెప్పారు...

ఈ తెలంగాణా వీరులు మోహన్ బాబు గురించి "సినిమా వాళ్ళకెందుకు రాజకీయాలు" అని మాట్లాడారు. మరి KCR, స్వర్గీయ NTR పార్టీ పెట్టినప్పుడు, ఆయన సినిమా వాడని తెలియదా? విజయశాంతి కి పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు తెలియదా? విజయశాంతి ని పక్కన కూర్చోపెట్టుకుని యాగాలు చేసినప్పుడు తెలియదా?
ఐనా సినిమా వాళ్ళకెందుకు రాజకీయాలు అని అడిగే హక్కు వీళ్ళకేముంది? రాజకీయాలు మాట్లాడాలంటే ఏ అర్హత కావాలో మీరే చెప్తారా?
ఆ మాటకొస్తే, professors కి ఎందుకు రాజకీయాలు? students కి ఎందుకు రాజకీయాలు? రాష్ట్రం బయట వున్న engineers/doctors/lawyers కి ఎందుకు రాజకీయాలు?

అజ్ఞాత చెప్పారు...

తాలిబాన్ల మెంటాలిటీ ఏమిటంటే వాళ్ళకు ఇష్టపడనది ఎవరూ మాట్లాడకూడదు అని, అలా మాట్లాడితే సహించము అన్న బూడ్డే మన తెలబానులది కూడా, అందులో లాజిక్ లు మాత్రం ఉండవు, లేకపోతే రాజీవ్ విగ్రహాన్ని, అన్నగారి విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు విగ్రహాలు పడగొట్టటం ఏమిటి? నోటి దురద తాగుబోతు గాడికి సరిపోయిన గ్యాంగ్ దొరికింది :)
వీళ్లను చూసి నవ్వితేనేమో దానికి ఫీల్ అవుతున్నాం అని బాధపడటం ఒకటి :)

ఆ.సౌమ్య చెప్పారు...

ఈ విషయాలు ఎవరికర్థమవుతున్నాయి. తెలంగాణా ప్రజలు అర్థచేసుకుంటున్నరా సీమాధ్ర ప్రజలు అర్థచేసుకుంటున్నరా? నిన్న చిదంబరం ప్రకటన తరువాత హైదరాబు లో బస్సులు తగలెట్టేసారు. 48 గంటలు బందు ప్రకటించారు. ఇప్పటికే విద్యార్ధులకి జరగాల్సిన పరీక్షలు ఎన్నో పోస్ట్ పోన్ అయిపోయాయి. ఇంక ఎన్ని ఆగాలి?

అసలు మనం అభివ్రుధి చెందాం అని మనసులో ఏ కోసాన అనుకోవడానికి వీలుగా లేకుండా చేస్తున్నారు...మన గమ్యం ఏమిటి, ఎక్కడి పోతున్నం అది మంచిదారా, చెడ్దదారా ....అసలు ఎవరైనా రెండు నిముషాలు కూర్చుని ప్రశాంతంగా అలోచిస్తున్నారా? శాంతి శాంతి అని మన కంఠ సోషే తప్ప.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థులని ద్వంసం చేస్తే జరిగే నష్టం ఎవరికి. వాటిల్లిన నష్టాన్ని మళ్ళీ మనమే పన్నులరూపంలో పూడ్చాలని ఎవరికైనా అర్థ్మవుతోందా? పోనీ సామాన్య ప్రజానీకానికి ఈ లెక్కలన్ని అర్థం కాకపోతే విద్యావంతులకో? డాక్టర్లు, న్యాయవాదులు, ఆచార్యులు, ఒకరేమిటి అన్ని రంగాలవారు జుట్టు జుట్టు పట్టుకుంటే ఎక్కడ తేలెది ఏమిటి తేలేది? హైకోర్టులో తెలంగాణా, సీమాంధ్ర లాయర్లు చేరొపక్క చేరి తగవులాడుకుంటారా? వాళ్ళా మనకి న్యాయస్థానప్రతినిధులు?

తెలంగాణాకు అన్యాయం జరిగిన మాట నిజమే. అలాగని సీమాంధ్రలో ఎక్కడా మేలైన అభివ్రుద్ధిలేదే ఒక్క గోదావరి పరీవాహక్ప్రాంతాలలో తప్ప. తెలంగాణా పోరాటానికి నేను ఎన్నడూ వ్యతిరేఖిని కాను...కాని జరుగుతున్నదేమిటి? గుండెమీద చెయ్యివేసుకుని చెప్పమనండి ఈ రాజకీయనాయకులనందరిని ఈ పోరటం హైదరాబాదు కోసం మాత్రమే కాదు సమైఖ్యత, లేదా తెలంగాణా అభివ్రుధి కోసమని. హైదరాబాదుని పెట్టుకుని మిగతా తెలంగాణాని అభివ్రుధి చెయ్యాలని ఆశిస్తున్నారు తెలంగాణా ప్రజలు. హైదరాబాదు లో పెట్టిన పెట్టుబడులు ఎక్కడ పోతాయో అని బాధపడిపోతున్నారు సీమాంధ్ర ప్రజలు. అందరు కూర్చుని మాట్లాడుకుని సమస్యని పరిష్కరించుకోవాలా లేక సమస్యని జటిలం చేసుకోవాలా?

విభజన, సమైక్యత అన్నవాటిల్లో ఏది కరెక్ట్ అనేది ఆయా ప్రాంతాల సామజిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దీనిపై చర్చలు జరిపి ఏది అందరికి ఊపయోగదాయకమో అది నెరవేర్చుకోవాలి. అంతేగాని తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళు అని ప్రతీ ఒక్కరు అనుకుంటే సమస్య ఎలా తేలేది. "Agree to Disagree" అనే పాలసీ మీద చర్చలకి కూర్చోవాలి.

నా ద్రుష్టిలో దీనికి రెండు పరిష్కారాలు ఉన్నాయి.

విభజనే ముఖ్యమనుకుంటే హైదరాబాదుని ఎవరికి కాకుండా కేంద్రపాలితప్రాంతంగా చెయ్యాలి

లేదా సమైఖ్యత రాష్ట్రోన్నతికి పాటుపడుతుంది అనుకుంటే వెనుకబడిన ప్రాంతాలలో అభివ్రుధి దిశగా ప్రణాళికలను రూపొంచింది తక్షణమే అమలుపరిచే యత్నం చెయ్యాలి

అసలు ఇవి అన్నీ కూర్చుని సమీక్షించుకుని చేయ్యగలిగే తీర్పులు కావు అనుకుంటే ఓటింగు పెట్టండి. అక్కడ మళ్ళా రిగ్గింగులు జరుగుతాయా...అవి మనకేం కొత్త కాదు కదా. దేశ, రాష్ట్ర ప్రజాప్రతినిధులనే ఈ విధంగా ఎన్నుకుంటున్నప్పుడు ఒక రాష్ట్ర విభజన విషయంలో ఈ పద్ధతి ఎందుకు మంచికాదు?

దేనికైనా శాంతి సంయమనం అవసరం

"ఓయి మానవుడా బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చినేమి? అందమును హత్యచేసెడి హంతకుండ, మైలపడిపోయనోయి నీ మనుజ జన్మ"....కరుణశ్రీ గారి పుష్పవిలాపం లోని వాక్యాలు గుర్తుకొస్తున్నాయి.
ఇక్కడ అందమునకు బదులు శాంతి అని మార్చుకుంటే మనకి అచ్చంగా అన్వయమవుతుంది.

సౌమ్య

అసంఖ్య చెప్పారు...

@అబ్రకదబ్ర: పునః స్వాగతం. కంఠశోష నిజమే. కానీ ప్రత్యక్ష్యంగా ఇందులో ఎలా పాలు పంచుకోవడం. నేను ఆం.ప్ర లో ఉంటే, తెలంగాణాలో బైకు యాత్ర చేసైనా చెప్పేవాడిని :)
@శ్రావ్యగారు, :)
@ నాగేశ్వర్ రావు : రాములమ్మ సంగతి ఇక చెప్పకండి :)
@ సౌమ్యా: చాలా ఓపికగా మీ అభిప్రాయన్ని చెప్పినందుకు చాలా సంతోషం. మీరు సూచించిన పరిష్కారాలూ బావున్నాయి. విభజనే పరిష్కారమా? చేస్తే ఎలా చెయ్యాలి అన్నది ఎవ్వరికీ తెలియదు. చెయ్యాలి - లేదా చెయ్యొద్దు అని అరిచి గీపెట్టడం తప్ప.


నేననుకోవడం, సీమ-కోస్తా ప్రజలు ఇంతకుముందు తెలంగాణా అంశాన్ని అసలు సీరియస్ గా తీసుకోలేదు. ఎన్నికలప్పుడు మేనిఫెస్టోల్లొ పెట్టినా, ఇది ఒక సాగతీత వ్యవహారం అనీ, విభజన వాదంతో వచ్చిన తె.రా.సే నే మట్టికొట్టుకుపోయినఫ్ఫుడు, ఇది రాదు, ఏదొ చాలా లైట్ తీసుకుnన్నారు.

ఒక్కసారి రాష్ట్ర ప్రక్రియ మొదలయ్యిందనే సరికి, ఉలిక్కి పడ్డారు.

కోస్తా సీమ ప్రాంతాల వారిని విభజకోరే వాళ్ళు కొన్ని రాజీ ప్రతిపాదలతో పాటూ, ప్రజలకి నచ్చ చెప్పే బాధ్యత తీసుకోవాల్సింది. ఇది ముమ్మాటికీ సిద్ధాంత కర్తల తప్పు.

ఇలా నమ్మించి మోసం చేసినందుకు, తెలంగాణా ప్రజలు, నాయకుల అసమర్ధత మీద అతినమ్మకమున్న, మానసికంగా సంసిద్ధులు కాని సీమ-కోస్తా ప్రజలు మోసగించబడ్డారు.

ఈ విషయాలు విభజన వాదులు గ్రహిస్తే బావుంటుంది మీరన్నట్టుగా.

విభజనకి వ్యతిరేకత అనేది ప్రత్యేకంగా పుట్టుకు రాదు. It is reactionary in nature.

ఆ.సౌమ్య చెప్పారు...

కరక్ట్, రాష్త్రవిభజన అందని ద్రాక్ష అనుకుని సీమాంధ్ర ప్రజలు లైట్ తీసుకున్నారు. ఒక్కసారిగా కేంద్రం ప్రకటించేసరికి ఉలిక్కిపడ్డారు. మిగతా రాజనీయనాకులంతా కూడా ఓట్లు దండుకోవడం కోసం మాహకూటమి అని, సామాజిక తెలంగాణా అని నినాదాలు పలికారు. ఒక్కసారి సీమంధ్ర లో జనావళి పెల్లుబికేసరికి ప్లేటు ఫిరాయించేరు.

ఈ మొత్తం వ్యవహారంలో మీరనట్టు సామన్య ఆంధ్రరాష్త్ర ప్రజ (ఇంకా విడిపోలేదు కాబట్టి తెలంగాణాని కలుపుకుని) మోసగింపబడ్డారు. ఈ విషయం ఎవరు ఎలా వారికి తెలియజేస్తారో, లేదా జరగాల్సిన వినాశనం జరిగాక ప్రజలే తెలుసుకుంటారో పెరుమాళ్ళకెరుక.

మీరు తెలంగాణా వీధులలో బైకులమీద తిరిగి ప్రచారం చేస్తానంటున్నారు. కోస్తా అని తెలిస్తే అక్కడికక్కడే కాళ్ళు చేతులు విరిచేస్తున్నారు. తెలంగాణ అని ఎవరైన అంటే నాలుక ముక్కలుకోస్తున్నారు.

అంతెందుకు నాకు తెలిసిన ఎంతో సఖ్యంగా ఉన్న తెలంగాణా, కోస్తా స్నేహితులు ఇప్పుడు ఒకరితోఒకరు మాట్లాడుకోవడం మానేసారు...ఇది విధివైపరీత్యమనుకోవాలా లేక బుద్ధిమాంద్యం అనుకోవాలా?

మన విజయనగరంలో ఎప్పుడైనా హింస, వివాదము, కార్లు, బస్సులు తగలబెట్టడం చూసారా ఎక్కడైనా రాస్తారోకో అన్న పదం వినబడిందా, ర్యాలీలు, సమ్మెలు జరిగాయా, అసలు జరుగుతాయని మనమెప్పుడైనా ఊహించామా? మీరు, నేను ఊర్లో లేము కాబట్టి అవన్నీ కళ్ళారా చూసే దురద్రుష్టం పట్టలేదు.

ఈ సమస్యని పరిష్కరించే మార్గంలో ఏదో ఒకటి చెయ్యలని నాకూ ఉంది, కాని ఏమి చెయ్యాలో బోధపడట్లేదు

సౌమ్య

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును