20, డిసెంబర్ 2009, ఆదివారం

తెలంగాణా ఉద్యమ నిర్వహణలో లోపాలు

ప్రస్తుతానికి రాజకీయనాయకులని పక్కన పెడదాం. ఈ ఉద్యమం ఫలితం ఏదైనా, అది మూడు ప్రాంతాల తెలుగు వాళ్ళనే కాకుండా దేశాన్ని ప్రభావితం చేసే అంశం. అటువంటిదాన్ని చాలా హ్రస్వ దృష్టితో నిర్వహించారు.

1956 తరువాత, గత ఏభై ఏళ్ళలో ఎంతోమంది కొస్తా-సీమ ప్రాంతవాసులు హైదరాబాదు పరిసరప్రాంతాల్లొ నివాసాలు, జీవనోపాధి కల్పించుకున్నారు. తెలంగాణా అంశం ముందుగా వీరిని, తద్వారా అనేకమంది కోస్తా-సీమ వాసుల్ని ప్రభావితం చేస్తుంది.

అలాగే ఇప్పటి తరం విద్యార్ధులు, ఆం.ప్ర గురించి తమ పాఠ్యాంశాలలో చదువుకున్నారు. వీరందిరికి విడిపోవడాం అనేది జీర్ణించుకులేని విషయం. ఏదో కోల్పోతున్నామే అనే తెలియని బాధ. ఉద్యమ లక్ష్యాలు, స్వరూపాలు వేరైనా, "కాశ్మీరు విడగొట్టండి" అనే ప్రతిపాదన ఎలాంటి భావోద్రేకాల్ని రేకెత్తిస్తిందో, తెలంగాణా విభజన అదేస్థాయి ఉద్రేకాన్ని కలిగిస్తుంది ( కనీసం నా వరకైనా). అలాగే, కోస్తా-సీమ వాసుల్ని దోపిడీ దారులు, దురాక్రమణదారులు అనడం కూడా (దీన్ని కె.సీ.ఆర్ తర్వాత ఖండించినా గానీ)

ఇటువంటి సున్నితమైన అంశం పట్టుకుని, ఎక్కడ అంధ్రా పేరు కనిపిస్తే, దానికి తెలంగాణా పేరు తగిలించడాం, భాగో-జాగో లంటి నినాదాలు, దురాక్రమణ దారులు-దోపిడీ దారులు అనే ఆరోపణలు, సానుభూతి ఉన్నవాళ్ళని కూడా దూరం చేస్తాయి. అలాగే, పోటీగా తెలంగాణా తల్లికి పిల్లలు ప్రాణం పోయడం అనవసరం.

ఇవేవీ కాకుండా, మనం విడిపోయినా తెలుగు తల్లికి రెండు కళ్ళలా మెదలుదాం, లాంటి పాజిటివ్ ఇమేజ్ తీసుకొచ్చుంటే, కొస్తా-సీమల్లో ఇంత నిరసన వచ్చేది కాదు. అంతటితో సరిపెట్టకుండా, చిన్న రాష్ట్రాల వలన పరిపాలనా సౌలభం కూడా వివరించి ఉంటే, వారి నుంచి కూడా మీకు మద్దత్తు ఉండేది.

తెలంగాణా ఏర్పడకపోతే, సివిల్ వార్ (జయశంకర్ ఉవాచ), అణువిస్ఫోటణం (కె.సి.ఆర్ ఉవాచ) జరగడానికి ఎంత సంభావ్యత ఉందో, కోస్తా-సీమ వాసుల అభిప్రాయాలని పరిగణించనప్పుడూ అంతే ఉంటుంది. పర్యవసానాలు అన్ని ప్రాంతాలవాళ్ళూ అనుభవిస్తారు. ఒకరికి లాభం ఒకరికి నష్టం రావు, యుద్ధమే వచ్చినప్పుడు.

నాకు తెలంగాణా ఉద్యమం పై సానుభూతి ఉన్నా సమైక్యంగా ఉండాడాన్నే కోరుకుంటాను. కొస్తా-సీమల్లో వినిపిస్తున్న ఉద్యమ రాగాలని స్పాన్సర్డ్ గీతాలుగా సంభోదించడాన్ని వ్యతిరేకిస్తున్నాను.

ప్రతీ ఒక్కరూ "అంతమంది ప్రజలకీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం తీసుకుంటాం" అంటారేగాని, అదేంటో చూపే ప్రయత్నం చెయ్యరు. తెలంగాణా ఉద్యమకారులు రాజీ పరిష్కారాలు ఆలోచించండి. ఈ పీట ముడి విప్పడానికి సహకరించండి.

నాకు వచ్చిన ఆలోచన ఇక్కడ

(నాకు హైదరాబాదు తో గానీ, తెలంగాణా తో గానీ సంబంధ-బాంధవ్యాలూ లేవు. అసలు ప్రత్యేక కోస్తావే లాభదాయకం!!!)

4 కామెంట్‌లు:

Sravya V చెప్పారు...

Very well written, 100 % percent I agree.

Kalidasu చెప్పారు...

నాకు తెలంగాణా ఉద్యమం పై సానుభూతి ఉన్నా సమైక్యంగా ఉండాడాన్నే కోరుకుంటాను.

Saanuboothi perita dopidini continue cheyyalani kutra

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI చెప్పారు...

ప్రియ నేస్తం!
నా బ్లాగ్స్ వీక్షించడానికి ఇదే నా ఆహ్వానం!!
www.raki9-4u.blogspot.com. . naa sweeya geethaalakai..(lyrics)
www.rakigita9-4u.blogspot.com naa sweeya naanaalakai...
www.raki-4u. blogspot.com naa sweeya vachana kavithalakai..
సదా మీ
స్నేహాభిలాషి
రాఖీ..

అజ్ఞాత చెప్పారు...

@jai telanna: Do you realize this-> people that like you make it hard to achieve your goals.

That was the point in this post :)

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును