25, ఆగస్టు 2010, బుధవారం

చ‘తురంగ’గతి బంధ కందము

చ‘తురంగ’గతి బంధ కందము రాయాలంటే, ముందు సర్వలఘుకందం ఒక్కటైనా రాయాలని, నిన్న ఒకటి రాసాను. ఆంధ్రామృతం బ్లాగులో మొదటగా చూసిన చ‘తురంగ’గతి బంధ కందము ప్రయత్నిద్దామని సంకల్పిచాను. కాకపోతే ఆచార్య చింతా రామకృష్ణారావుగారు చేసిన ప్రయోగం కొంచం కష్టమనిపించి, సరళమైన విధంగా, paved road మీద తురగగమనం సాగింది.
కం||
కలువ తళుకుబెళుకుల చెలి
యల కులుకులొలుకు కనులవియగు జిగిబిగి సొం
పుల శృతిలయగతులు వలపు
గొలుసులు ముడిపడి అలజడి గొలిపె నిలకడన్
8 x 8 పట్టికలో అమరిస్తే



















లు ళు కు బె ళు
కు చె లి కు లు
కు లొ లు కు ను వి
గు జి గిబి గి సొ
పు శృ తి తు
లు పు
గొ లు సు లు
ము డి డి డి
గొ లి పె ని న్
చ‘తురంగ’గతి బంధం కావించబడ్డ వాక్యం "కలువచెలియకనులసొగసులు". చదరంగం బోర్డులో గుఱ్ఱం నడక, మొదటి గడి top,left corner (r1,c1) లో మొదలయ్యి రెండు అడ్డం (ఎడమనుంచి, కుడికి) ఒక నిలువు, ఇలా సాగింది. ఈ నడకలో సౌలభ్యం , ప్రతి మూడు అక్షరాలు ఏలాగూ ఒక అర్ధం వచ్చే వరుసలోనే ఉంటాయి. ఉదాహరణకి, చెలియ. ఇందులో ఉన్న మరో విశేషం, (r1 c1) దగ్గర మొదలైతే, (r6,c8) దగ్గర బోర్డు బయటకి వచ్చేస్తాం అంతరాయం లేకుండగా. అలాకాకండా, రెండు నిలువు, ఒక అడ్డం వేసినప్పుడు, వాక్యనిర్మాణం కొంచం క్లిష్టతరం అవుతుంది. మరొక విషయం, రెండవ పాదంలో, చివరి అక్షరం "సొం" ని "సొ + ం" గా విడగొట్టడం జరిగింది. ఇది సర్వలఘు కందం అవుతుందో అవదో తెలియదు మరి. అంటే, "డన్ = డ + న్" కి ఇచ్చిన exception, ఇక్కడకూడా వర్తిస్తుందా మరి? వర్తిస్తుందనే అనుకుంటున్నాను.

5 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! సోమశేఖరా! నీ అసాధారణ ప్రయత్నాన్ని నేనభినందిస్తున్నాను. పద్యం బాగుంది.

అసంఖ్య చెప్పారు...

మాష్టారు,
ప్రోత్సాహకరవచనములకు ధన్యవాదములు.

ఇది భావకవిత్వమే కాబట్టి స్వేచ్ఛ ఎక్కువ. ఒక న్యస్తాక్షరి సమస్య + ఇతివృత్తం ఇస్తే చెయ్యగలనో లేదో.

ప్రస్తుతానికి "బంధనం" చెయ్యగలనా లేదా అని ప్రయత్నిస్తున్నాను.

రవి చెప్పారు...

పద్యం బహు చక్కగా వ్రాశారండి. అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! సోమశేఖరా!నీవు తురగాన్ని బంధించలేదు. చతురత చూపి తురంగ గమనం సాగించావు. అందుకే ఇది చతురంగ గతి బంధ కవిత అనిపించుకొంటుంది.

అసంఖ్య చెప్పారు...

@రవిగారు, :)
మీకు ఇంతకుముందు సమాధానం చెప్పలేదు కదూ. నాకు కామెంట్లు రాయడానికి మహచెడ్డ బద్దకం, మరోల అనుకోకండి. మీకు అప్పీలు పెట్టిన దత్తపది, మత్తేభం కి, మీఅద్బుతమైన "సిరికింజెప్పడు.." parody యేప్రేరణ.

@మాష్టారు,
wrong step పట్టేసారు. ఈ తెల్లవారు లేచి సరిచేద్దాం అనుకుంటుండగానే, నాకు గుగ్గిళ్ళుపెట్టేసారు :). మీ సునిశిత పరిశీలన నాలంటి పైత్యకారుకలకి ఎంతైనా తోడ్పడుతుంది.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును