19, ఆగస్టు 2010, గురువారం

జయహో సర్దార్

నాకు సర్దార్జీలంటే చిన్నప్పట్నుంచీ ప్రత్యేక అభిమానం. కారణాలనేకం. మొదటగా, సైన్యంలో ఎక్కువ కనిపించేది ఈ జాతే వారేకదా. డీడీ-౧ లో అప్పట్లో పరమవీరచక్ర ధారావాహికం వచ్చేది. అందులో కూడా పునీత్ ఇస్సార్ (ధుర్యోధనుడు) సర్దార్ పాత్ర ఇప్పటికీ గుర్తుంది. ఇవి కాకుండా, వాళ్ళ భాంగ్డా నృత్యాలు, మరీ ముఖ్యంగా ఢోల్ వాయిద్యం. వాళ్లు పలకరించే విధానం, నిష్కల్మష హృయం, శ్రమించే తత్వం, శరీర ధారుడ్యం - ఇలా ఎన్నో ఉత్తమ గుణాలు ఈ జాతిలో నాకు కనిపిస్తాయి. అటు సైన్యంలో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, గోధుమలు వగైరా తిండిగింజలని పండిస్తూ, దేశప్రజలని కడా పోషిస్తున్నారు. వారికి నా పద్యకుసుమాంజలులు:

ఆ.వె||
సిక్కుజాతి సమర సింహముకు జయహో.
ఉక్కుకండకు, నిప్పు గుండెలకు ప్రణతులు. జయహో
కర్షక కులతిలక. గైకొను జోతలు
శౌర్యపరాక్రమశోభితసైనికాగ్రేశరా.


అందుచేతనేనేమో, పంజాబ్ లో ఖలిస్తాన్ ఉద్యమం, వేర్పాటువాదం, ఇందిరాగాంధీ మరణానంతరం సిక్కుల ఊచకోత అత్యంత బాధ కలిగించిన విషయాలు. ఖలిస్తాన్ ఉద్యమం చల్లబడుతుందని, అప్పుటి పత్రికల్లో వచ్చే వార్తలబట్టి, దృశ్యాలనిబట్టి అసలు అనుకోలేదు. విచిత్రం, ఈ మధ్య సిక్కుల్లో మళ్ళే అంతర్గత కలహాలు మొదలయ్యి, అనిశ్చిత, అశాంతియుత వాతావరణం, మరో రూపంలో దాపురించింది. ప్రపంచంలో ఎక్కడా చూసినా అంతర్గత కలహాలే, ఇవే పోకడలు. సిక్కులు కూడా వీటికి అతీతులు కాదా! అహో!

కామెంట్‌లు లేవు:

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును