- వృత్తాల్ని ఎందుకు కుదించకూడదు
- భరనభభరవ, ఈ వరుస క్రమాన్నే ఎందుకు ఎంచుకున్నారు, ఎలా ఎన్నుకున్నారు.
- సంగీతంలో కొత్త రాగాలు కనుక్కుంటున్నారు. మరి ఛందస్సులో కూడా కొత్త వృత్తాలో, జాతులో, మరో వర్గాన్నో తయారుచెయ్యలేమే. చెయ్యాలంటే, దానికి పద్ధతి అంటూ ఏమైనా ఉందా?
భ ర న భ భ ర వ
U I I U I U I I I U I I U I I U I U I U
తానన తాన తా న తన తానన తానన తాన తా న తా
సరిగ్గా యతి స్థానం దగ్గర విడగొడితే,
భ ర న
భ భ ర వ
వీటితో, ఒక కందం, ఆటవెలది "లాంటి" పద్యాల్ని తయారుచెయ్యొచ్చు. ఇంకొంచం విశదీకరిస్తే, ఈ క్రింది సూత్రాలు తీసుకోవచ్చు
1 వ పాదం: భ ర న1-2 పాదాలు సంయుక్తంగా, అలాగే ౩-4 కలిపి ఉత్పలమాల నియమాలు పాటించాలి. అంటే
2 వ పాదం: భ భ ర వ
3 వ పాదం: భ ర న
4 వ పాదం: భ భ ర వ
1 వ పాదం మొదటి అక్షరానికి, 2 పాదం మొదటి అక్షరానికి యతి-మైత్రి ఉండాలి.
౩ వ పాదం మొదటి అక్షరానికి, 4 వపాదం మొదటి అక్షరానికి యతి-మైత్రి ఉండాలి.
1 వ పాదం మొదటి అక్షరానికి, ౩ పాదం కి ప్రాస నియమం వర్తిస్తుంది.
ఇప్పుడు మరిన్ని ఆంక్షలు విధించొచ్చు, ఎలా అంటే
2 వ పాదం మొదటి అక్షరానికి, ఆందులో ౩ వ గణం మొదటి అక్షరానికి యతి-మైత్రి ఉండాలి (కందం లో లాగ)మరి కొంచెం బిగిస్తే
4 వ పాదం మొదటి అక్షరానికి, ఆందులో ౩ వ గణం మొదటి అక్షరానికి యతి-మైత్రి ఉండాలి (కందం లో లాగ)
ప్రాస నియమం పాటించడం
ఈ నియమాలు పాటిస్తే, ఉత్పలమాల లోని, మొదటి రెండు, చివరి రెండు పాదాలు, వాటంతట అవే, "కందంలాంటి" పద్యాల్లాగ కనిపిస్తాయి. ఆ రకంగా ఆంక్షలతో కూడిన ఒక లఘువృత్తం తయరవుతుంది.
కనీసం ఇలా ఆలోచించడం వలన, ఒక ఉత్పలమాల పద్యాన్ని రాయగలిగాను. ఇదే నా మొదటి ఉత్పలమాల.
ఉ||తప్పులు దొరకనంత వరకూ ఇది ఉత్పలమాలే. దొరికితే ఛ.లే.ప అవుంతుంది. :)
వృత్తము వ్రాయగన్ జడిసి వేరొక మార్గము లేకనే కదా,
చిత్తము పోరగన్, వగచి, చెత్తగ వృత్తము గీసితిన్, చఛా!
బెత్తము తీయకండి మరి బేరుమనేడ్వగలన్. కృపాకరా,
విత్తము నాటితిన్ ఇపుడె, విత్తులు, రూకలు సేకరించగాన్!
2 కామెంట్‌లు:
చిరంజీవీ! సోమ శేఖరా!
నీ యత్నసాఫల్యానికి నాకు చాలా ఆనందం కలిగింది.
మొత్తముపైన వృత్తమును మోజుగ వ్రాసిన సోమ శేఖరా!
బెత్తమదేల గాని; జడిపించెద; లక్షణ యుక్తమయ్యు;నీ
వృత్తము చిత్రమందు కను విందొనరింపగ వ్రాయుమంచు.లో
కోత్తర సద్విచక్షణల నొప్పెడి నీ కభినందనావళుల్.
మాష్టారూ-- ఓహ్ మీరు అలవోకగా పద్యాన్ని రాసే తీరు చూస్తుంటే ఎంతో సంతోషం కలుగుతుంది.
వట్రసుడి కి యతిమైత్రి ఎలావెయ్యాలో మీ బ్లాగులో చూసే తెలుసుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే, అసలు పద్యాలపై మక్కువ కలగడానికి కారణం మీరే. అందుకు సర్వదా కృతజ్ఞుడ్ణి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి