18, ఆగస్టు 2010, బుధవారం

కీర్వాణెవరయ్యా? హింసకు హేతువయా (అందరి బంధువయా పాటకి పేరడి)

ఈ మధ్య సంగీత దర్శకులు వాళ్ళ సినిమాల్లో టైటిల్ సాంగా, ఐటం సాంగా అన్న తేడాల్లేకుండా అన్నిపాటలు పాడేసి శ్రోతలని తెగ విసిగించెస్తున్నారు. అందులో అగ్రస్థానం కీరవాణిది. తరువాత, చక్రి, హీమేష్ మొదలైనవారు. వీళ్ళని - స్వరకర్తలు, స్వతహా పాటగాళ్ళు అయిన, ఘంటశాల, రాజేశ్వరరావు, ఇళయరాజా, రెహ్మాన్ - లతో పోలుస్తూ, సరదాకి అందరి బంధువయా టైటిల్ సాంగ్ - సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా కి పేరడి (అసలుపాట నలుపురంగులోను, పేరడీ నీలంరంగులోనూ ఉంచబడ్డాయి) గా ఒక పాట.


సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా.
సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా.

ఘంట్సా లెవరయ్యా, గన గంధర్వుడేనయ్యా!
రాజేశ్వరు డెవరయ్యా, స్వరబ్రహ్మే కదవయ్యా.

ఇళైరాజెవరయ్యా, ఇసైజ్ఞానే పదవయ్యా.
రెహ్మానెవరయ్యా, మన అందరి బంధువయా.

(గనగంధర్వుడయా -గాన గంధర్వుడయా లేదా ఘన గంధర్వుడయాకి శబ్దరూపాంతరం)

నేలనింగినీరూనిప్పూ, నిలువనిచ్చేగాలీ
తమతమ స్వార్ధం చూసుకుంటే, మన గతి ఏం కావాలి
కొంచెం పంచవయా, నువ్వు అందరి బంధువయా
మంచిని పెంచవయా, నువ్వు అందరి బంధువయా

ఘంటశాలిళైరాజ్ రాజేశ్వరుడు,
తమతమ స్వార్ధం చూసుకునుంటే, మీ గతి ఏమయ్యేదో?
కొంచెం ఆపరయా, మిరు హింసకు హేతువయా
పాటను పంచరయా, మరి అందరి బంధువవా


జగతికి ప్రేమను పంచుటకోసం, శిల్వను ఎక్కిన జీసస్
సత్యంకోసం విషంతాగి, సందేశం ఇచ్చిన సొక్రటీస్
అహింసయే తన గొప్ప ఆయుధం, అనినిరూపించిన గాంధి
తమకు ఎప్పుడు ఏమీ కాని, జనం కోసమే తపించి
సుఖాలు త్యజించి, మహాత్ములై నిలిచారు
వీరంతా ఎవరయ్యా, మనలాగే మనుషులయా!

జగతికి పాటను పంచుటకోసం, తప్పుకున్న ఇళయరాజు
ప్రతిభను పెంచుటకోసం, కొత్తవారిని తెచ్చిన రెహ్మాన్

భిన్నత చాటుటకోసం, ఎంతొమందిని మెచ్చుకున్న మహదేవుడే

తమకు ఎప్పుడు ఏమీ కాని, జనం కోసమే తపించి

స్వరాలు త్యజించి, మహాత్ములై నిలిచారు.

వీరంతా ఎవరయ్యా, మీలాగే స్వరకర్తలయా!

కీర్వాణెవరయా, మన హింసకు మూలమయా
కొంచం ఆపవయా, బాలూ ఏడ్చునయా

చక్రీ ఎవరెయ్యా, మన హింసకు హేతువయా

కీచ్వాణాపవయా, చెవిలో రక్తం వచ్చునయా

హేమేషె వరెయ్యా, మన హింసకు హేతువయా

టోపీ తీయవయ్యా, భువిలో యద్ధం వచ్చునయా.


సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా.

ఘంట్సా లెవరయా, మన అందరి బంధువయా
రెహ్మానెవరయ్యా, మన అందరి బంధువయా.

కామెంట్‌లు లేవు:

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును