19, ఏప్రిల్ 2009, ఆదివారం

మల్లెల మాలలూగక మానునా, మాయునా?

మల్లీశ్వరి సినిమాలో "మనసున మల్లెల మాలలూగెనే" పాట ఏమాత్రం అభిరుచి ఉన్న శ్రోతలకైనా తెలుస్తుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన తెలుగు సొగసుల సిరి మల్లెల మాలలు ఆ సినిమాలోని మాటల పాటలు, పాటల ఆటలు.

వారి మేనకోడలు, అవసరాల (వింజమూరి) అనసూయాదేవి గారు ఎన్నో జానపద గీతాలని ఆంధ్రదేశమంతా తెరిగి, వెతికి పట్టి, బాణీలు కట్టి, స్వరబద్ధం చేసినవారుగా చిరపరిచితులు. వారి కృషిని మెచ్చి, ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు "కళాప్రపూర్ణ" బిరుదుతో ఆవిడని సముచితంగా సత్కరించారు. వారిని 22 వ టెక్సాస్ తెలుగు సాహితీ సభల సందర్భంగా కలవడం జరిగింది. ఆవిడ మాట్లాడుతూ కొన్ని ఆశక్తికరమైన విషయాలని చెప్పారు. మల్లెశ్వరి లో, "నోమీ నోమన్నలాలొ" పాటకి, అలాగే "మనసున మల్లెల" పాటకి కూడా, బాణీలు ఆవిడే సమకూర్చేరుట (కానీ సినిమాలో రాజేశ్వరరావు గారీ పేరే కనబడుతుంది). అందుకే
కృష్ణశాస్త్రి విరచితమవ్వంగ
వింజమూరి రసస్వర వింజామరలు
విసురుగ విసరంగ, మనసున మల్లెల మాల
లూగక మానునా, మాయునా!
ఆవిడ కుటుంబానికి ఎంతోమంది పేరిన్నిక గల కవుల ( విశ్వనాధ, కొకు, శ్రీశ్రీ, చలం...) తో ఉన్న సన్నిహిత భాంధవ్యాల గురించి, ఆవిడ స్వంతమాటల్లొ ఇక్కడ వినండి (నిడివి 19 ని||)



(ఆ గొంతుక విన్నవారెవ్వరు, ఆవిడకి 89 సంవత్సరాలంటే నమ్మకపోవచ్చు)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

జనవరిలో వంగూరి ఫౌండేషన్ హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో వింజమూరి అనసూయాదేవి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్నిచ్చి గౌరవించింది. నిజానికి తనను తాను గౌరవించుకున్నట్టు. ఆమె రూపం, గొంతు... ఏ దేవి వరమో అవి. గౌరవాన్ని స్వీకరించిన తర్వాత ఆమె మాట్లాడుతూ, ‘తిరిగి మీ అందరికీ కనిపించగలనో లేదో, నా మాట వినిపించగలనో లేదో’ అంటూంటే నాకే కాదు, అక్కడున్న చిన్నాపెద్దా చాలామందికి కన్నీళ్లొచ్చేశాయి.

anveshi చెప్పారు...

చాలా బావుంది .వీకెండు ఏమీ చెయ్యలేదు/చదవలేదు .. IPL తోనే అయిపోయినది అనుకుంటే మీ బ్లాగు పుణ్యమాని మంచి అదౄష్టం కలిగించారు. :)

భగవంతుడు ఆమెకి మరింత ఆరోగ్యాని ఇచ్చి మనతో మరిన్ని మంచి అనుభవాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను.

Naga చెప్పారు...

నెనరులు

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును