1, ఏప్రిల్ 2009, బుధవారం

తెలుగు పద్యానికి compiler?

భైరవభట్ల గారు, పద్యం.నెట్ మీద టపా రాసినప్పుడు,
పద్యం.నెట్లో, (నాలాంటి) ఔత్సాహికులు పద్యాలు రాయప్రయత్నిస్తే, వ్యాకరణ పరంగా అవి సరియైనవా, లేక, వాటిలో తప్పులు ఏమైనా ఉన్నాయో గుర్తించి, సవరణలకి సూచనలు చేసే సౌలభ్యం ఉంటేబావుంటుంది
అని వ్యాఖ్యరాద్దామనుకుంటూనే, మళ్ళే, ప్రతీ పద్యాన్ని పరీక్ష చెయ్యడం, ఎంత ఖాళీ సమయమున్నా కుదరకపోవచ్చని ఆగిపోయాను. మరి పరిష్కారమేంటి అని అలోచిస్తుండాగా ఇలాతోచింది. ఇది ఎంతవరకు సాధ్యమో (అసాధ్యంకాదు అని నా నమ్మకం) తెలుగు సాఫ్టువేరు జనులు చూడండి:

తెలుగు పద్యానికి వ్యాకరణం ఉన్నాది. గణ విభజన, యతి-ప్రాస, మినహాయింపులు ఇత్యాదులు. ఇవన్నీ చూస్తే, తెలుగు పద్యానికి ఒక compiler ( lexicon analyzer + syntax analyzer మాత్రమే) తయారుచేయడం (మరీ)అంత కష్టంకాదనిపిస్తుంది,

ఉదాహరణకి (laTeX ని అనుకరిస్తూ):
\begin{ATaveladi}
uppugappurambu nrokkapolikanunDu \\
chooDachooDa ruchula jaaDa vaeraya \\
purushulandu puNya purushulu vaeraya \\
viSwadaabhiraama vinura vaema \\

\end{ATaveladi}

పై పద్యాన్ని, compile చేసిన తరువాత, ఆటవెలది లో ఉండాల్సిన గాణాలు లేవనో, ఒక వేళ యతి తప్పితే, ఏ పాదంలో తప్పిందో చెప్తూ, యతి-ప్రాస కుదిరే అక్షరాల్ని సూచించడం లాంటి పనులు సాఫ్టువేరు ద్వారా చేస్తే?


వీటిలో అనుభం ఉన్నవారు, మీ అభిప్రాయాలని తెలియజేయండి. కష్టసాధ్యం కాదు అనుకుంటే, ప్రయత్నించవచ్చు కూడా! ఒకవేళ ఇలాంటి పరికరాలుంటే, నాకు సూచించగలరు.

11 కామెంట్‌లు:

Anil Dasari చెప్పారు...

ఐడియా బాగుంది కానీ పద్యాలు రాయటం వంటి సృజనాత్మక విషయాల్లో కంప్యూటర్ల జోక్యం అనవసరమేమో?

సూర్యుడు చెప్పారు...

Good idea, I too thought about it long back. I don't know any existing tools to do this job. Should not be much difficult though :)

surya prakash చెప్పారు...

సాహితి ఆర్గ్ సైటులో ఇటువంటిదే వుంది. కాకపోతే IE లోనే అక్షరాలు బాగా కనపడతాయి. ఈ లింకు చూడండి http://www.sahiti.org/chamdassu/index.jsp

సూర్యప్రకాషు

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

చక్కటి ఆలోచన మన తెలుగువారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి ఇది పెద్ద కష్టమనుకోవడంలేదు నేను.ఆలోచనంటూ ఒకటి వచ్చింది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి

Unknown చెప్పారు...

నిజానికిదేమి కష్ట సాధ్యం కాదు. సులభమైన పనే, అయితే కవుల పనులలో మరమనుషుల ప్రవేశం ఎంత మేరకు సబబు?

రవి చెప్పారు...

ఆలోచన బావుంది. ఇదే సాఫ్ట్ వేరు ను నిఘంటువు కు అనుసంధానించి, గణం తప్పుగా ఉన్న చోట మరో గణాన్ని సూచించేటట్టు కూడా అభివృధ్హి చేయవచ్చేమో? (చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో తెలియదు)

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

రవిగారు, అప్పుడు కవికి ఊహ నసించిపోతుందేమో :)

రవి చెప్పారు...

భాస్కర రామి రెడ్డి, అబ్రకదబ్ర, ప్రదీప్ గార్లు : పద్యం రాయడానికి భావం మొలకెత్తటం ప్రధానం అని నా ఉద్దేశం.

ఇలాంటి ఉపకరణాల వల్ల సృజనాత్మకత దెబ్బ తింటుందని అనుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం syntax and semantics ను మాత్రమే సరిదిద్దుతుంది. ఇంకా అయితే కాస్తో కూస్తో సూచనలు చేస్తుంది.

కాబట్టి మంచి ఊహే ఇది...

అసంఖ్య చెప్పారు...

@అబ్రకదబ్ర,మిరియాల,రామిరెడ్డి గార్లు: మీరు లేవనెత్తిన ప్రశ్న "ఈ ఉపకరణం సృజనాత్మకని దెబ్బతీస్తుంది" అనే తత్వానికి సంబంధించినది. దీనిపై నా అభిప్రాయం:

1)ఈ ఉపకరణం ఒక తెలుగు మాస్టారు చెయ్యాల్సిన పనిని నిర్వర్తిస్తుంది. వ్యాకరణంలో ప్రావీణ్యం ఉన్నవారికి దీని అవసరంలేదు. ఉదాహరణకి, ఆచార్యులు చింతారామకృష్ణారావుగారు లాంటివాళ్ళు. వారికి ఆలోచన పూర్తవ్వకుండానే, ఆలోచనల్లోనే గణవిభజన, యతి-ప్రాస వగైరాలు ఇమిడిపోతాయి. ఇది అనుభవంతోనూ, కృషితోనూ వచ్చేది. ఇంక భాష అంటేనే, కొన్ని నియమాలకి లోబడి పనిచేస్తుంది. ఈ ఉపకరణం ఆ నియమ నిబంధనలని అమలుపరిచేలా చేస్తుంది.

2) "ఎలా రాయాలో" అన్నదానికి మాత్రమేగానీ, "ఏమి రాయాలి" అన్నదానికి ఈ ఉపకరణం ఏ విధంగానూ అడ్దంకి కాకూడదు. పద్యరచన అనే సమీకరణంలో ఇది ఒక ఉత్ప్రేరకంగా మాత్రమే గానీ, మూలపదార్ధంగా ఉండకూడదు. అందుకే semantics జోలికి పోలేదు.

అసలింతకీ దీని అవసరం ఎందుకు?

1) పైన టపాలో ఉటంకించినట్లుగా, పద్యంచుట్టూ, పద్యంకోసం అల్లబడిన ఆలోచన కాబట్టి, ఈ ఉపకరణం, ఆ ప్రయత్నాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఔత్సాహికులకి చేయూతనిచ్చేదిగా ఉపకరిస్తుంది.

2) రవిగారు వ్యక్తపరిచినట్టు గా semantics ని కూడా కలిపితే, తెలుగుకి పూర్తిస్థాయి Word Processor ని తయారుచెయ్యడానికి తొలి అడుగులు పడినట్టుగా. ఉదాహరణకి MS Word లో
"He start his work" అని type చేస్తే "He starts his work" అనిసూచిస్తుంది. అనగా, ఈ ఉపకరణ తయారీకి చెయ్యాల్సిన పరిశ్రమ (వ్యాకరణ సూత్రాలని అమలుపరిచే శాస్త్రీయ ప్రక్రియ)వలన మరెన్నో లాభాలు ఒనగూరవచ్చు.

@రవిప్రకాష్ గారు: సాహితి.ఆర్గ్ ని సూచించినందుకు ధన్యవాదాలు. ఇంతకు ముందు ఆ సైటుని ఉపయోగించినా, నా దృష్టి ఛందస్సు మీదకి వెళ్లకపోవడంవలన నాకు తెలియలేదు. కాకపోతే, ఉపకరణం పని చేస్తున్నట్టుగా లేదు. మీరు కృతకృత్యులయ్యారా? సాహితి.ఆర్గ్ వ్యవస్థాపకుడైన ముక్రి (మురళీకృష్ణ నందుల) ఇంజనీరింగులో నాకు సహవిద్యార్ధి. అతనిని కనుక్కుంటే, 2002లో unicode support కోసం Java లో APIs రాసినసంధర్బంలోనిది. చూస్తాను విషయం ఏమిటో అని చెప్పారు.

@సూర్యుడు, చిలమకూరు గార్లు:మనం (అంటే ఆంధ్రులు) ఆరంభశూరులం మాత్రమే. ఇది ఎంతవరకు ఆచరించగలమో చూడాలి. :). compiler design మీద లైబ్రరీ నుంచి ఓ రెండు పుస్తకాలు తెచ్చి ప్రయత్నమైతే మొదలు పెట్టాను (అంటే ఈ ప్రాజెక్టుని మా ఆవిడకి అప్పజెప్పేసాను).

పాలుపంచుకోవల్లన్న వాళ్ళు, సలహాలు, సూచనలు ఇద్దామనుకున్నవాళ్ళు, somasd at gmail కి ఒక వేగు పంపగలరు.

మరొక తలపు: గూగుల్/యాహూ లాంటివాళ్ళు, నాచురల్ లాంగ్వాజి పరిశోధకులు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారా? దీనికి అధికారభాషా సంఘం ఏమైనా సహాయంచెయ్యగలదా? మీ అభిప్రాయాలేంటి?

Anil Dasari చెప్పారు...

@ధవళ:

మీరన్నది నిజమే. ఆలోచిస్తే, కవిత్వంలో అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తున్నవాళ్లకి ఇటువంటివాటివల్ల తప్పులు దిద్దుకునే అవకాశం, మరింత త్వరగా నేర్చుకునే అవకాశం ఉంటాయనిపించింది. నియమాల మీద కాకుండా భావం మీద ఎక్కువ దృష్టి కెంద్రీకరించే అవకాశం ఇటువంటి టూల్స్ ఇస్తాయనిపించింది.

కామేశ్వరరావు చెప్పారు...

సోమశేఖర్ గారు,

మంచి ఆలోచనండి. సాహితి సైటులో పద్య లేఖిని ఇంతకుముందు పని చేసేది. ఇప్పుడెందుకో పని చెయ్యడం లేదు. అయినా అది వృత్తాలకే పరిమితం.
నూటికి నూరుశాతం ఛందస్సుని check చెయ్యగలగడం సాధ్యం కాకపోవచ్చు కాని 90% దాకా చెయ్యవచ్చు.
జాతి ఉపజాతి పద్యాల ఛందస్సు అన్నిటికన్నా కష్టం అవుతుంది. అలాగే యతి మైత్రిని check చెయ్యడం కూడా కొంచెం కష్టమే.
పద్యాన్ని ASCII Textగా కన్నా Unicode stringగా తీసుకుంటే సులువవుతుందనుకుంటాను. అప్పుడు ఒకో character ఒకో అక్షరాన్ని సూచిస్తుంది. ముందు గురు లఘువులని గుర్తించాలి. వృత్తాలకి గురు లఘువులు గుర్తిస్తే చాలు. వాటి వరుస క్రమాన్ని బట్టి ఏ వృత్తమో ఇట్టే నిర్ణయించ వచ్చు.
అదే జాతి-ఉపజాతి పద్యాలకైతే మళ్ళీ సూర్య-ఇంద్ర గణాలు నిర్వచించుకొని, వాటిని గుర్తించే లాజిక్కు రాయాలి.
వ్యాఖ్య పెద్దదవుతోంది.
వివరంగా కావలిస్తే ఈమైల్లో మాట్లాడుకుందాం.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును