10, ఏప్రిల్ 2009, శుక్రవారం

పద్యం - వృత్తాలు - అంకెలు

సాంప్రదాయకంగా మనం పద్యాల ఛందస్సుని నేర్చుకున్నప్పుడు
" ఈ పద్యానికి ఈ గణాలు ఫలానా వరుసక్రమంలో రావాలి"
అని నేర్చుకుంటాం. ఉదాహరణకి, ఉత్పలమాల తీసుకుందాం.
"భ ర న భ భ ర వ"
UII - UIU - III - UII - UII - UIU - IU
అనే గణాలు వరుస క్రమంలో ప్రతిపాదంలోనీ రావాలి.
అనగా లఘువులు, గురువులు (మొత్తం కలిపి 20) ఈ క్రమంలో రావాలి. అదే లఘువుని "౦" గానూ, గురువుని "1" గానీ గుర్తించామనుకోండి: అప్పుడు వచ్చే సంఖ్య
UII - UIU - III  - UII - UII -  UIU - IU
100 - 101 - 000 - 100 - 100 - 101 - 01

ఆ సంఖ్యని దశాంసమానంలో రాస్తే 607381

ఒకవేళ ఎక్కడైనా ఒక గణం తప్పయ్యిందనుకోండి, ఉదాహరణకి, చివరి "IU" కి బదులుగా "II" అనే గణాలు మీపద్యంలో పడ్డాయనుకోండి, అప్పుడు, మీ పద్యంలోని పాదం యొక్క సంఖ్య
UII  UIU III   UII UII   UIU II
100 101 000 100 100 101 00
607381 - 1 = 607380

గణం చివరిదయ్యింది కాబట్టి, సులువుగా పట్టేసాం. మరి ఎన్నే చోట్ల తప్పుంటే? ఏ స్థానంలో తప్పుందో కనుక్కోవడం ఎలా?

అది ఆలోచించే ముందు, exclusive-or లేదా xor అనే బూలియన్ సూత్రం చూద్దాం. దాని ప్రకారం:
0 + 0 = 0
0 + 1 = 1
1 + 0 = 1
1 + 1 = 0

దీన్ని ఉపయోగిస్తే మనం తప్పు ఎక్కడుందో ఇట్టే పట్టేయొచ్చు. ఇందాక ఉదాహరణని తీసుకుంటే:
100 101 000 100 100 101 01
+
100 101 000 100 100 101 00
=
000 000 000 000 000 000 01

కాబట్టి, ఎక్కడైతే, మనకి ఒకటి కనిపిస్తుందో, ఆ స్థానాలన్నిటిలోనూ గణం తప్పిందని తెలుస్తుంది. పై ఉదాహరణలో 20 వస్థానంలో తప్పిందని ఇట్టే తెలుస్తుంది కదూ?

ఇప్పుడు అన్ని (నాకుతెలిసినవి ) వృత్తాలని చూద్దాం:

ఉత్పలమాల:
"భ ర న భ భ ర వ
UII - UIU  - III  - UII  - UII - UIU -  IU
100 - 101 - 000 - 100 - 100 - 101 - 01 = 607381

చంపకమాల:
న  జ  భ  జ  జ  జ  ర
III - IUI - UII - IUI - IUI - IUI - UIU
౦00 - 010 - 100 - 010 - 010 - 010 - 101 = 83093
మత్తేభం:
స భ ర న మ య వ
IUU - UII - UIU - III - UUU - IUU - IU
IIU - UII - UIU - III - UUU - IUU - IU
001 - 100 - 101 - 000 - 111 - 011 - 01 = 207085
శార్ధూలం:
మ స జ స త త గ
U U U - I I U - I U I - I I U - U U I - U U I - U
111 - 001 - 010 - 001 - 110 - 110 - 1 = 469229
వచ్చే టపాలో జాతులు పైన శోధిద్దాం. అంతవరకు శెలవు.
(భైరవభట్ల గారు తప్పు సరిదిద్దినందుకు కృతజ్ఞతలు)

9 కామెంట్‌లు:

సూర్యుడు చెప్పారు...

Interesting analysis.

But how do you convert each line in a poem to those binary numbers?

~sUryuDu :-)

అసంఖ్య చెప్పారు...

sUryuDu garu:
bhairavabhaTla garu sent me his inputs based on unicode. I still need to go thru them

If text inputting is based on RTS, we can parse based on long and short forms of acchulu (with few exceptions of course).

EoW: End-of-Word

step-1:
sU / ryu / Du
sU: long U EoW
ryu: short u EoW but more than two letters in ryu
Du: short u EoW, two or less letters

steo-2: Look ahead one word:

sU: long U or following word (ryu) is saMyuktAkSharam
sU -> guruvu

ryu: following word is hrasvaM & u is short
ryu -> laghuvu

Du: following word is NA & u is short
therfore Du -> laghuvu

finally:
sUryuDu -> 100


These ideas are still nascent, though

కామేశ్వరరావు చెప్పారు...

శేఖర్,

మత్తేభం సరైన గురు-లగువు క్రమం ఇది:
IIU - UII - UIU - III - UUU - IUU - IU

శార్దూలంలో మొదటి గురువుని రెండు లఘువుగా చేస్తే మత్తేభం వస్తుంది. అలాగే ఉత్పలమాల-చంపకమాల కూడా. ఉత్పలమాలలో మొదటి గురువుని రెండు లఘువులు చేస్తే చంపకమాల వస్తుంది.

binary addition ద్వారా ఏ అక్షరం తప్పిందో తెలుసుకొనే పద్ధతి బావుంది, నాకిది తట్టలేదు.

అసంఖ్య చెప్పారు...

@కామేశ్వరరావు గారు: భలేగా తప్పుపట్టారండి. సరిదిద్దాను. మీరు చెప్పిన కొత్తవిషయాలు బావున్నాయి. మీరు పంపిన విషయాలు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఇంకా.

సూర్యుడు చెప్పారు...

Good one, looks like you are coming closure to the solution.

All the best and good luck :-)

~sUryuDu (100) :-)

అసంఖ్య చెప్పారు...

http://padyam.asankhya.org

Unknown చెప్పారు...

మీ ఆలోచన చాలా బాగుంది...
all the best

Unknown చెప్పారు...

Somashekhar gaaru,
Check this page once. It might be helpful for you http://www3.miriyala.in/chandassu.html
Contact me if you need additional info

అసంఖ్య చెప్పారు...

@ఫణిప్రదీప్ గారు: అద్బుతం. చాలా తక్కువ సమయంలో చేసేసారు. భలే. మీకొక email పంపాను చూడండి.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును