7, ఏప్రిల్ 2009, మంగళవారం

BIG EVENT - చిరు సాయం

పన్నెండు వేల మంది సైనికులు
చేతిలో చీల్చిచెండాడే మరతుపాకులు
రణగొణధ్వనులు చేస్తూ చ్చక్కర్లు కొడుతున్న యుద్ధట్యాంకులు
సైనికాధ్యక్షుడు "ఆగే బఢో" అంటూ ఆవేశంతో ఆజ్ఞాపిస్తూ, సైనిక పట్టాలన్ని యుద్ధానికి సన్నద్ధులని చేస్తుంటే?
ఓహ్ ... ఊహించికుంటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది కదూ!

మరి ఆ సైనికులు బదులుగా విధ్యార్ధులుంటే
మరతుపాకులకి బదులుగా పలుగులు-పారలు, కుంచెలు, నిచ్చెనలుంటే
సర్వసైన్యాధ్యక్షుడు, తమలో ఒకడై, పదండి ముందుకు, కర్మభూమి ఋణం తీర్చుటకు, అంటూ సేవాతత్పరతని జాగృతపరుస్తుంటే? ఒళ్ళు పులకరిస్తుంది కదూ!

దాని పేరే BIG EVENT.
1982 న TAMU లో ప్రారంభమైన BIG-EVENT, అమెరికా సంయిక్తరాష్ట్రాల్లో విధ్యార్ధులచేత నడపబడే అతిపెద్ద సేవాకార్యక్రమం. దీని ముఖ్యోద్దేశ్యం, స్థానిక ప్రజలకి విద్యార్ధులు వివిధ స్వచ్చంద సేవాకార్యక్రమాల ద్వారా కృతజ్ఞతలు తెలుపడం. ప్రస్తుతం ఇది, మరొక 50 కి పైగా ఇతరకళాసాలలకి వ్యాపించింది.

ఈ సంవత్సరం Child Rights & You (CRY) సంస్థ తరపున ఒక పదిమందికి పైగా భారతీయులం BIG-EVENT లో పాలుపంచుకిన్నాం. అధ్యక్షుడు జార్జ్ బుష్ Sr , గడ్డకట్టే చలిని లెక్క చెయ్యకుండా వచ్చిన పన్నెండువేల పైచిలుకు విద్యార్ధులనుద్దేసించి ప్రసంగించడంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది. ప్రసంగాలూ అవి ముగియగానే, చీమలదండులా బయలుదేరి అందరం పని-ముట్లు సేకరించుకొని, రెండు జట్లుగా విడిపోయి, మాకు అప్పచెప్పబడిన ఇళ్ళకి కి చేరుకున్నాం. ఒక నల్లజాతి వ్యక్తి ఇంట్లో అడుగుపెట్టం నాకు అదే మొదటిసారి. ఆర్ధికతారతమ్యాలని ప్రత్యక్షంగా చూడ్డంకూడా అదే మొదటిసారి.

మాకు అప్పజెప్పిన పనులు పట్టిక చూసుకొని, చెయ్యాల్సిన పనులని విభజించుకున్నాం. ఇద్దరు ఇంటి ముందు పచ్చికని శుభ్రం చేస్తూంటే, మరో ఇద్దరు ఇంటికి బయట వెల్ల వేయడం మొదలు పెట్టారు. మిగిలిన ఇద్దరం వంటగది, పరిసరాలు శుభ్రంచేసాం. తరువాత, బీరువాలు, కిటికీలు, అరుగులకి వెల్ల వేసాం. ఇదంతా అయ్యేసరికి ఒక ఐదు గంటలు పట్టిండి. మిగతా వాళ్ళు కూడా తమ తమ పనులు పూర్తిచేసేసారు ఈ లోగా. పనిలో పనిగా పైంట్ డబ్బాలు ఒలకబొయ్యడం లాంటి అప్పజెప్పని పనులు కూడా చేసాం. పూలకుండీలు చేతిలోంచి జారిపోతే, క్షమాపణలతో పాటు, పరిహారంగా ఒక పదిహేను డాలర్లు సమర్పించుకోవడంతో, మా కార్యక్రమం పూర్తయ్యింది. పనిముట్లన్నీ తిరిగి ఇవ్వడంతో, మా వరకు BIG-EVENT అయిపోయింది. పాలుపంచుకున్నందుకు సంతృప్తి మిగిలింది. ఇలాంటి కార్యక్రమాలు మన కళాశాలల్లో కూడా జాతీయ స్థాయిలో చేస్తే బావుంటుందనిపించింది.

అసలు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే:

మేనేజిమెంట్, ఎడ్వర్టయిజింగ్, ట్రాన్స్పొర్టేషను, ఐ-టి, హాస్పిటలిటి, లాజిస్టిక్సు, ఇలా ఎన్నో బిభాగాల కో-ఆర్డినాషన్ కావాలి. ఇవి ఆయా సబ్జెక్టులు చదువుతున్న విద్యార్ధులకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించడానికి ఎంతో తోడ్పడతాయి. కలగూరగంప లో తాడేపల్లిగారు చెప్పినట్లు, అవకాశాలని మనం సృష్టించుకోవాలి. ఈ ఒక్క ఈవెంట్ ద్వారా, విద్యార్ధులు క్లాసురూములో నేర్చులోలేని ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. పాశ్చాత్యదేశాల్లో అమలవుతున్న "మంచిని" కూడా మనం సంగ్రహించాలి. నేషన్ బిల్డింగ్ కి పునాదులు విశ్వవిద్యాలయాల్లొనే అని నా నమ్మకం. అవి రాజకీయాలైనా, వృత్తివిద్యలైనా, మరేదైనా. ముఖ్యాంగా మన తెలుగుసినిమాల్లో కాలేజీలు అంటే, సొల్లు-కబుర్లు చెప్పడం, అధ్యాపకులతో కుళ్ళు జోకులు వెయ్యడం, అమ్మాయల్ని ఏడిపంచడనికి తప్పా మరెందుకూ ప్పనికిరాని రోడ్దుపక్క బడ్డీకొట్లులాగ చూపిస్తున్న పరిస్థితులు మారాలని ఆశిద్దాం.

-శెలవు

4 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మంచి కార్యక్రమములో పాలుపంచుకున్న మీకు అభినందనలు

అజ్ఞాత చెప్పారు...

పాశ్చాత్య దేశాల్లోని పబ్బులూ, మాల్సూవంటివన్నీ మనకు మర్నాడే దిగుమతి అయిపోతాయిగానీ, ఇలాంటి సంస్కృతి ఎందుకు కాదో! వారాంతాల్లో హాస్పిటళ్లలో పనిచెయ్యడం, విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ అసిస్టెంటుగా చెయ్యడం, ఇటువంటివి కూడా వస్తే బాగుండు. మీ పని బావుంది.. అభినందనలు.

Kathi Mahesh Kumar చెప్పారు...

అభినందనలు.

అసంఖ్య చెప్పారు...

@చిలమకూరు/మహేష్ గారు: ఇక్కడ అభినందన్లు అందుకోవాల్సినంత గొప్పపనేమీ చెయ్యలేదండీ. అసలు విషయంచెప్పడంలో కొంచం బద్దకించేను. అదేంటంటే?

--
మేనేజిమెంట్, ఎడ్వర్టయిజింగ్, ట్రాన్స్పొర్టేషను, ఐ-టి, హాస్పిటలిటి, లాజిస్టిక్సు, ఇలా ఎన్నో బిభాగాల కో-ఆర్డినాషన్ కావాలి. ఇవి ఆయా సబ్జెక్టులు చదువుతున్న విద్యార్ధులకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పెంపొందించడానికి ఎంతో తోడ్పడతాయి. కలగూరగంప లో తాడేపల్లిగారు చెప్పినట్లు, అవకాశాలని మనం సృష్టించుకోవాలి. ఈ ఒక్క ఈవెంట్ ద్వారా, విద్యార్ధులు క్లాసురూములో నేర్చులోలేని ఎన్నో పాఠాలు నేర్చుకుంటారు. పాశ్చాత్యదేశాల్లో అమలవుతున్న "మంచిని" కూడా మనం సంగ్రహించాలి. నేషన్ బిల్డింగ్ కి పునాదులు విశ్వవిద్యాలయాల్లొనే అని నా నమ్మకం. అవి రాజకీయాలైనా, వృత్తివిద్యలైనా, మరేదైనా. ముఖ్యాంగా మన తెలుగుసినిమాల్లో కాలేజీలు అంటే, సొల్లు-కబుర్లు చెప్పడం, అధ్యాపకులతో కుళ్ళు జోకులు వెయ్యడం, అమ్మాయల్ని ఏడిపంచడనికి తప్పా మరెందుకూ ప్పనికిరాని రోడ్దుపక్క బడ్డీకొట్లులాగ చూపిస్తున్న పరిస్థితులు మారాలని ఆశిద్దాం.
--

@అరుణగారు: అవును నిజమే. మీరి చెప్పిన తర్వాత, టపాని కొంచం విశదీకరించాను. ధన్యవాదాలు.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును