ఆ.వె
దట్టముగను, కట్టుదిట్టముగను పిండిఎందుకు అంటారా, ఆలసించినఆశాభంగం
పొట్టనాలుగడ్డ, పోవునంత
ఉల్లిగడ్డ, బాగమఱిగినానూనెలొ,
వేగినా సమోస, వడిగతినుము! ||
ఎందులకింకెందులకీ సమాలోచనలుఅంటూ సమోసాలు తింటూ బ్లాగులు చదువుకోండి :).
సాలు, సాలు, రసాలూరు సమోసాలు!
పై పద్యం మొన్న potluck dinner లో మా అందరికీ సమోసాలు చేసిపెట్టిన భానువాళ్ళ అమ్మగారికి అంకితం
ps: పెద్దలు వ్యాకరణ దోషాలు ఉంటే సూచించగలరు.
3 కామెంట్లు:
పొట్టనాలుగడ్డ... :)
మరిగినా, వేగినా వంటి ప్రయోగాలు ఒక్కసారి సరి చూడండి.
భావం:
మైదాపిండి,కొంచం వరిపిండి కలిపి, పల్చని రొట్టెలా చేసుకొని, దాని పొట్టలో బంగాళదుంపలు, సరిపడా ఉల్లిపాయలు బాగా దట్టంగా కుక్కి, కూరి, సలసలకాగున్న నూనెలో వాటిని వేయిస్తే, సమోసాలు తయారు. అవి త్వరగా తినండి, లేకపోతే చల్లబడిపోతాయికదా!
@రాఘవ గారూ: మీరుమరీ అంత cryptic గా చెప్తే మాబోంటి పామరులకు అర్ధంకాదు :). నేను ఇలా ఉద్దేశ్యించి రాసాను:
పొట్టన + ఆలుగడ్డ = పొట్టనాలుగడ్డ
మఱిగిన + ఆనూనె = మఱిగినానూనె
వేగిన + ఆ సమోస = వేగినాసమోస
ఇందులో దోషములు కొంచం వివరించగలరు
౧ మరిగిన ఆ నూనె మరిగిన యా నూనె ఔతుందని నా అభిప్రాయము. అట్లే వేగిన యా సమోస.
౨ పొట్టనాలుగడ్డ పొట్టన్ ఆలుగడ్డ గా నేను అనుకున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి