17, జనవరి 2009, శనివారం

సమోసా : వహ్ క్యా బాత్ హై

ఇది బహుళ జనాభిప్రాయమే కదా! మరి ఆటవెలది లో సమోసాపై పద్యం చూడండి:

ఆ.వె
దట్టముగను, కట్టుదిట్టముగను పిండి
పొట్టనాలుగడ్డ, పోవునంత
ఉల్లిగడ్డ, బాగమఱిగినానూనెలొ,
వేగినా సమోస, వడిగతినుము! ||
ఎందుకు అంటారా, ఆలసించినఆశాభంగం
ఎందులకింకెందులకీ సమాలోచనలు
సాలు, సాలు, రసాలూరు సమోసాలు!
అంటూ సమోసాలు తింటూ బ్లాగులు చదువుకోండి :).
పై పద్యం మొన్న potluck dinner లో మా అందరికీ సమోసాలు చేసిపెట్టిన భానువాళ్ళ అమ్మగారికి అంకితం


ps: పెద్దలు వ్యాకరణ దోషాలు ఉంటే సూచించగలరు.

3 కామెంట్‌లు:

రాఘవ చెప్పారు...

పొట్టనాలుగడ్డ... :)

మరిగినా, వేగినా వంటి ప్రయోగాలు ఒక్కసారి సరి చూడండి.

అసంఖ్య చెప్పారు...

భావం:
మైదాపిండి,కొంచం వరిపిండి కలిపి, పల్చని రొట్టెలా చేసుకొని, దాని పొట్టలో బంగాళదుంపలు, సరిపడా ఉల్లిపాయలు బాగా దట్టంగా కుక్కి, కూరి, సలసలకాగున్న నూనెలో వాటిని వేయిస్తే, సమోసాలు తయారు. అవి త్వరగా తినండి, లేకపోతే చల్లబడిపోతాయికదా!

@రాఘవ గారూ: మీరుమరీ అంత cryptic గా చెప్తే మాబోంటి పామరులకు అర్ధంకాదు :). నేను ఇలా ఉద్దేశ్యించి రాసాను:

పొట్టన + ఆలుగడ్డ = పొట్టనాలుగడ్డ
మఱిగిన + ఆనూనె = మఱిగినానూనె
వేగిన + ఆ సమోస = వేగినాసమోస

ఇందులో దోషములు కొంచం వివరించగలరు

రాఘవ చెప్పారు...

౧ మరిగిన ఆ నూనె మరిగిన యా నూనె ఔతుందని నా అభిప్రాయము. అట్లే వేగిన యా సమోస.
౨ పొట్టనాలుగడ్డ పొట్టన్ ఆలుగడ్డ గా నేను అనుకున్నాను.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును