20, జనవరి 2009, మంగళవారం

ఆంధ్రామృతం దత్తపూరణం

ఆచార్యులు చింతా రామకృష్ణారావు గారిచ్చిన దత్తపూరణం

"అక్క, చెల్లె, బావ, అన్న" అన్న పదాలతో "రామాయణానికి" సంభందించి ఒక పద్యం రాయాలి. నేను చేసిన ప్రయత్నం ఆటవెలది లో:

ఆ.వె:
"బావ" యనుచు వెంటపడిన రావణుచెల్లె
లముకుచెవులు కోసె లక్ష్మణుండు
అక్కసుతొవెడెలెను రక్కసి "అమ్మా! హు"
అని వగచుచు చేరెనన్న దరికి

ఇందులో, "బావ యనుచు వెంట పడిన" అన్న ప్రయోగం కొంచం వాడుకభాషకి దగ్గరలో ఉంది. దీని ఇంకాబాగా రాస్తే బావుణ్ణు. కానీ ఛందస్సుతో పని కాబట్టి నాకింకా అంత భావస్వేచ్ఛ రాలేదు. ప్రస్తుతం ఛందసు కోసమే ప్రయాస పడాల్సి వస్తొంది.

ఆచార్యులు కొన్ని తప్పులు సవరించారు. వాటిని comments లో చూడగలరు.

5 కామెంట్‌లు:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

"బావ" యనుచు వెంటపడిన రావణునిచెల్లె
లముకుచెవులు కోసె లక్ష్మణుండు
అక్కసుతొవెడెలెను రక్కసి "హా! అన్నా!"
అని వగచుచు అన్న దరికి

ఈ పద్యంలో చివరి పాదంలో చేరె అనే పదం మర్చిపోయుంటారు.
అని వగచుచు చేరె నన్న దరికి. అంటే సరిపోతుంది.

మీ ప్రయత్నానికి చాలా ఆనందంగావుంది.
అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హాయన్నా అని పొరపాటున పడివుంటుంది
హా యన్న! అనేది సరిపడుతుంది.

నేస్తం చెప్పారు...

అభినందనలు.chaalaa bagundi

అసంఖ్య చెప్పారు...

@ఆచార్యా: రొప్పుతున్నుప్పుదు అమ్మా, అనో, అబ్బా అనో, దీర్ఘం రావడం సహజం కాబట్టి, "అమ్మా, హు" అని కొంచం స్వేచ్ఛ తీసుకొని తప్పుదిద్దాను.

"అని వగచుచు చేరెనన్న దరికి " అద్భుతమైన సవరణ, masterstroke.

లక్ష్మణుడు దగ్గర క్రోథంతో, ప్రతీకారేచ్ఛతో వెళ్ళిపోయింది. కానీ, రావణుడి దగ్గరకి వచ్చేసరికి, రొప్పుతూ రావణుడి జాలిని గైకొంది.

@నేస్తం గారూ: నెనెరులు :)

soorammatta చెప్పారు...

అల్లుడూ! ఇరగదీసావు....!!!!
వాడుక భాష లో రాయకూడదన్న రూల్ ఎక్కడా లేదు. So, dont worry.... and keep it up!

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును