11, జనవరి 2009, ఆదివారం

బోటనీ పాఠముంది - పపాజాను పిజ్జ ఉంది

"బోటనీ పాఠముంది, మేటనీ ఆట ఉంది,
సోదరా ఏది బెస్టు రా!!!"
ఈ పాట మీ అందరినోటా బాగానే నాని ఉంటుందని నా అభిప్రాయం. మరి దానికి ఈ "పేరడీ" పాట చూడండి

అతడు:
papa john pizza ఉంది, burger-king burger ఉంది
సోదరా ఏది బెస్టు రా!
subway sub ఉంది, McD Mac ఉంది
దేనికో ఓటు చెప్పరా!
ఆమె:
pizzaలు, burgerలు తిన్నవాళ్ళు,
బస్తాల్లా, గిస్తాల్లా, బలిసి పోతరు

ఆవకాయ పప్పుకూడు తినిచూడు,
ముందరా, వెనాకాలా తేడచూడు!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
car లో gas లేదు, race లో ace లేదు
మార్గమే చెప్పుగురువా!
అప్పులే పెరిగిపోయె, పప్పులే కరిగిపోయె
problem ఏ solve చెయ్యవా!
కొండలా course ఉంది, ఎంతకీ తరగనంది,
ఏందిరో ఈ గొడవా!
ఆమె:
ఎందుకూ హైరాణా చిట్టినాన్న
వెళ్ళరా సులువైన రూటులోనా!
వద్దురా Ph.D పట్టా గోల, చాలురా Masters ఇకనైనా!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
Bostonలో బాల ఉంది, Houstonలో కేళి ఉంది
సోదరా ఏది best రా!
ఆమె:
Bostonలో బాలగోల మనకేలా,
Houstonలో కేళి అంటే ఒళ్ళు గుల్ల!
జిగడ జిగడ... జిగడ,జిగడ జా....
అతడు:
Bush లా బుస్సుమనే, Saddam లా తుస్సు మనే ఎవ్వడీ సీమరెడ్డి

అందరూ:
తందనా తందననా, తందనా తందననా,
తందనా తందననా....
అంటూ ముగుస్తుంది. ఆ వీడియోని క్రింద చూడండి


ఈ పాట కోసం రాసుకున్న, వాడని చరణాలు/పల్లవి:

  1. carl marx పాఠముంది, cinemark సినిమా ఉంద, దేనికో ఓటు చెప్పరా!
  2. wikipedia site ఉంది, youtube video ఉంది, ఇందులో ఏది best రా!
  3. Algebra class ఉంది AlJajeera TV ఉంది, ఇందులో ఏది best రా!
  4. subway sub అంటె డబ్బు, డబ్బు, McD Mac అంటే, దగ్గు, దగ్గు,
  5. starbucks coffee అంట, తగ్గు తగ్గు, జిగడ జిగడ ....
క్రెడిట్స్:
గాయని: మైత్రిరెడ్డి ముద్దసాని
కొరెయోగ్రఫీ: వీచిక ఇరగవరపు/సోమశేఖర్ ధవళ
కెమెరా: శిరీష్ కౌశిక్ లక్కరాజు/సోమశేఖర్ ధవళ
రచన/గానం/కూర్పు/దర్శకత్వం: సోమశేఖర్ ధవళ
సలహాదారు: అరుణ

పైపాట తియ్యడం కోసం మేముపడ్డ పాట్లు గురించి...

ఇందులో మీరు చూసినవారందరూ, college students యే! ఎవ్వరికీ ఇంతకుముందు నటించిన అనుభవంలేదు. అందులోనీ, తెలుగు సినిమా పాటలకి అవసరమయ్యే Dance Steps అసలు రావు. అంతమందినీ పెద్ద class room hall ముందు సమావేశపరిచి, కొంచం చేతులు, కాళ్ళు, నడ్దీ ముడ్డీ ఊపడం నేర్పేము. Song background లో play చేస్తూ, కాసేపు Drill practice చేయించాం. తరువాత left, right చేతులు చాపుతూ చప్పట్లు కొట్టడం, ఇవి మా వీడియోలో choregraph చెయ్యబడిన steps. ఈ తతంగం అంతా అయ్యేసరికి ఒక మూడు గంటలు పట్టింది. అన్నీటికన్నా ఎక్కువ, train పెట్టెలా నడుస్తూ చప్పట్లు కొట్టడం. అందరూ కుడివైపుకి కొడితే, ఒక్కడు మాత్రం ఎడమవైపుకి కొడతాడు. అంతమందినీ synchronize చేసేసరికి మూడు చెరువుల నీళ్ళు తాగాల్సొచ్చింది. కాకపోతే అంతమందీ ఉత్సాహంగా పాల్గొన్నారు. మొదట్లో కొంచం సిగ్గుపడినా గాని. ఇంక, వీడియో తీసే క్రమంలో జరిగే goof-ups ఎన్నో.

పాట గురించి కొన్ని సాంకేతిక విషయాలు:
ఇందులో పాడిన అమ్మాయి, చాలా బాగా పాడుతుంది. కానీ, male singers విషయానికొచ్చేసరికి మాకు ఎవరూ దొరకలేదు. దాంతో, track singer లా నేను పాడాను. తరువాత ఎవరైనా తెలుగు బాగా పాడేవాళ్ళు దొరికితే వాళ్ళాచే పాడిద్దామని. కాని, editing చాల time-taking process. అందుకే మళ్ళే అవన్నే చేసే ఓపికలేక, నేను పాడిన version ఏ ఉంచేసాం. అదే మీరు విన్నారు (పాపం, మీ ఖర్మ కాకపోతేనూ).

original song ని audacity లో edit చేసాము. మాకు కావాల్సిన basic beat patterns ని original song నుంచి extract చేసాం. తరువాత, ఆ beats తో loops create చేసాం. దాని మీద voice track ని overlay చేసాం. చివర్లో "తందనా తందనా ..." అని chorus లా ఉంది కదా. అది in fact ఒకరు పాడిందే. ఒక track తీసుకొని, కొంచం delay చేసి, అలాంటివి several versions add చేస్తే మీకు chorus effect వస్తుంది.

ఇది మేము Shiva born again అని ఒక సినిమాలాంటి వీడియో తీసిన ప్రయత్నంలోనిది. దానిపై మరెప్పుడైనా,
అంతవరకు శెలవు!

7 కామెంట్‌లు:

KumarN చెప్పారు...

Damn!. It's so cool man.

ఈ మధ్యన ఇక్కడ తెలుగు ఎం ఎస్ స్టూడెంట్స్ చేసిన వీడియోలు చాలా చూస్తున్నా.

Looks like I missed so much!

వా( వా(

శ్రీ చెప్పారు...

చాలా బాగా ఉంది.విరగదీసారు.

చరణం చివరలో పాత స్టెప్ చూపించడం ప్రొఫెషనల్ గా ఉంది.

నేస్తం చెప్పారు...

చాలా బాగా ఉంది.. :) very good

కొత్త పాళీ చెప్పారు...

Good show!
The parody lyric is the best part.
The group steps in the corridor etc were good too.

Bhãskar Rãmarãju చెప్పారు...

>>ముందరా, వెనాకాలా తేడచూడు
దీని భావమేమి????:):)

Shiva Bandaru చెప్పారు...

good job

అసంఖ్య చెప్పారు...

@కుమార్, శ్రీ, వేణూశ్రీకాంత్, నేస్తం, కొత్తపాళీ, శివ:
నెనెరులు. ఇంకా చాలా విషయాలు బాగాచెయ్యొచ్చనుకోండీ :)


@భాస్కర్ రామరాజు: ముందు, వెనాకాల అంటే,

మీరు US లో TV ads చూసేఉంటారు. weight reduction programmes, before diet ఒక బొమ్మ వేసి, after diet, ఇంకో బొమ్మ చూపించి, you loose this much weight అని అంటారు కదా.

Tune కి సరిపడట్టు గా, ముందరా, వెనాకాలా అని వాడ్డం జరిగింది.

అలాగే race లో ace లేదు లో: race అంటే, extremely competitive studies అని, ace అంటే course లో A grade అని అర్ధంతో అలా రాయడం జరిగింది.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును