ప్రతిభా పాటిల్.
కాదు, ప్రతిభలేని పాటిల్.
అంతేకాదు ప్రతిభతో పాటూ పాటవం కూడా లేని పాటిల్.
కొంగుకప్పుకొని ఆవిడ ఉండే ఏ ఛాయాచిత్రాన్ని చూసినా నాకు కలిగే భావన ఇదే! మనం ఒక పది తరాలు వెనక్కి వెళ్ళిపొయినట్టుగా ఉంటుంది. ఈవిడేనా మన త్రివిధదళాధిపతి అనిపిస్తుంది. ప్రతీ గణతంత్రదినంనాడూ ఇచ్చే ఉపన్యాసాలు విని/చదివి స్ఫూర్తిపొందిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అని నా అనుమానం. మనరాజ్యాంగంలో, రాష్ట్రపతి పదవి రబ్బర్ స్టాంప్ అయితే, ఈవిడ ఆ మూసలో అచ్చుగుద్దినట్టుగా సరిపోతారు. సినీపరిభాషలో చెప్పాలంటే ఆ పాత్రకి "పూర్తి" న్యాయంచేస్తారు.
మన్మోహన్ సింహ్ గారు కూడా అలాగే తోస్తారు. అయన జ్ఞానే కావచ్చు, కానీ వెన్నెముకలేని నాయకునిలా కనిపిస్తారు. మానవమృగాలు స్వేచ్ఛగా సంచరించే "zoo" లో బంధించ బడ్డ ఈ సింహం జూలు విదిలిస్తే, ఆ జూలు రాలిపోతుందని జాలి కలుగుతుందే తప్ప, మనతోలుతీసి డోలువాయించగలదని ఎవరికైనా అనిపిస్తుందా?
"తీవ్రవాదుల్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం" అని వీరిద్దరిలో ఎవరైనా ఘర్జిస్తున్నప్పుడు,
గుండె వేగంగా కొట్టుకుంటూ,
రోమాలు నిక్కబొడుచుకుంటూ,
కనుబొమ్మలు దగ్గరైతూ,
మెదడులో "నేనుకూడా అందులో ఒక సైనికుణ్ణి కావాలి "
లాంటి ఆలోచనలు మొదలుతయా? లేక
పెదవులమీద ఒక నిరాశక్తి, నిర్లిప్తలతో కూడైన నవ్వు,
నేను ఏడ్వలేక నవ్వుతున్నాను అంటుందా?
గమనిక: ఇది పూర్తిగా నిరాధారపూరితమైన భావన. ఎవర్ని చూసినా ఒక అభిప్రాయ్ం (తప్పో, ఒప్పో) ఏర్పరుచుకుంటాం. ఇది కూడా అలాంటిదే!
6 కామెంట్లు:
పాటవం లేకపోవడమేంటండి,అమ్మగారి భక్తులం గదా !
"పాటవం లేకపోవడమేంటండి,అమ్మగారి భక్తులం గదా "
బాగా చెప్పారు. ఈ పేరు కూడా మీరు వినే ఉంటారు. "భజన్ లాల్". కాంగ్రెసులో అంతా ఇలాంటివాళ్ళే! కొంచెం కూడ ఆత్మాభిమానం ఉన్నట్టుగా కనిపించదు.
వారి ఇద్దరి గురించి బాగా వ్రాసారు. They are the tools in the hands of Sonia to harvest souls for her bosses in the West.
And don't forget about Samul YS, who is running a largest conversion program in the world, with the help of State Government and tax payers funds. Samuls daughter is a missionary, his son-in-law is a missionary and his whole family is doing missionary activities.
Where as stupid Hindus handing political power to such people.
చూడగానే నేను ఎప్పుడూ అనుకునే మాట చెప్పారు (ప్రతిభ లేని పాటిల్ గురించి). ఆవిడ అలా వుండకూడదు (వేషధారణ) అని నేను అనను. ఐతే, ఆవిడ ముందు వున్న చాలా మంది లాగే (ఉదాహరణ: శంకర్ దయాళ్ శర్మ) ఈవిడ కూడా రబ్బరు స్టాంపులా, జీవం, ఆలోచన లేని ఒక వస్తువులా, అలా కనిపించడమే రాష్ట్రపతి పదవికి తగునని అనుకునే మనిషిలా కనిపిస్తుంది. మరో కలాం ఆ పదవి ఎప్పుడు చేపడతారో కదా!!.
బాగా చెప్పారు. ఈమె కలాం కన్నా ముందు రాష్ట్రపతిగా వచ్చుంటే, సరేలే రాష్ట్రపతులు ఇలాగే ఉంటారని అనుకునేవాడిని. కానీ కలాంని చూసిన కళ్ళతో ఈవిడ్ని చూడాలంటే చాలా కష్టంగా ఉంది.
@pseudosecular: రాజశేఖర్ కుటుంబ సభ్యుల మత ప్రచారం గూర్చి ప్రధాన వార్తాపత్రికలలో చూడలేదు. వీటి (మత ప్రచారం వగైరా) modus operandi తెలిస్తే చెప్పగలరు
@రామ: నేను మీతో ఏకభవిస్తున్నాను (వస్త్రధారణ విషయంలో)
@రామ, చైతన్య క్రిష్ణ పాటూరు: అవును. పాటిల్ లాంటి వాళ్ళవల్ల వారికి గౌరవం వస్తుంది. అదే T.N. Seshan, కలాం లాటి వాళ్ళ వల్ల పదవికి గుర్తింపు, గౌరవం లభిస్తాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి