31, జులై 2010, శనివారం

సమస్యా పూరణ - కారు నెక్క బోయె కలికి యలిగి

సత్యదేవ్ చిలుకూరి గారిచ్చిన సమస్య
కారు నెక్క బోయె కలికి యలిగి
ఆటవెలదిలో పూరించాలి

నా పూరణ - 1

ఆ.వె||
నీవు కలివి. ఔను, నీవు నా కలివి నా
ఆకలివి. అరెనువు ఆశనివిగ.
పొఫ్ఫొ! యనదలింప, పోయి రైరయ్యని
కారు నెక్క బోయె కలికి యలిగి
నా పూరణ - 2
ఆ.వె||
కారు మబ్బు కమ్మె, కటిక చీకటి చిమ్మె
కన్నె కలికి వన్నె గన్న వెఱ్ఱెక్కిన
కుఱ్ఱకారు కారుకూతల జోరుకు
కారు నెక్క బోయె కలికి యలిగి

సత్యదేవ్ చిలుకూరి గారి అద్భుత పూరణ
ఆ.వె||
చీర వంద కాదు ఆరేడు డాలర్లు
బేరమాడు చుండె బేల యొకతె
బోరు కొట్టి మగడు భోర్భోరునేడ్వగా
కారునెక్క బోయె కలికి యలిగి

పద్మపోడూరిగారి పూరణ-1 కి నా సవరణతో
ఆ.వె||
చారు లోన ఉప్పు జర తక్కువైయ్యెగ
కూర కాస్త మాడె కొంత బొగ్గు
గయని నోరుజారగను, కొరకొర చూచి
కారు నెక్క బోయె కలికి యలిగి
పద్మపోడూరిగారి పూరణ-2 కి నా సవరణతో
ఆ.వె||
చీర వంద గజము ఆరు డాలర్లకె
మూర రవికె మదుపు ముప్పదెటుల
గునని నోరు జారగ నను కసిరికొట్టి
కారునెక్క బోయె కలికి యలిగి

1 కామెంట్‌:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

తెలిసి నట్టి యువతి తీయమన టిక్కెట్టు
తీసి యిస్తి. దాని చూచె చెలియ.
చెలికి నేను నిజము చెప్పు నంతటి లోనె
కారు నెక్క బోయె కలికి యలిగి.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును