16, జులై 2010, శుక్రవారం

ముక్కుపుడక - అసూయ

ఛ.లే.ప||*
చక్కగ చెక్కిన, పసిడి ముక్కెరనిడ,
మక్కువ పద్మనాధుని కాంతులిడి, తళుక్కుమనెనె,
అప్ప్రకాశంబునన్, మ్రుక్కునవ్రేలిడు అమ్మలక్కల
లక్కసునసూయలు గోచరించెను సుస్పష్టముగనున్

బంగారంపు ముక్కుపుడుక పై ముచ్చటపడి
పద్మనాధుడు అంటే, సూర్యుని కిరణలు పడగానే
ఆ ప్రతికిరణాల ప్రకాశంలో, వెలుగులో, మిగతా అమ్మలక్కందరి
అసూయ, ఈర్ష్యలు స్పష్టంగా కనిపించాయి

* ఛ.లే.ప - ఛందస్సు లేని పద్యం :)

3 కామెంట్‌లు:

padma చెప్పారు...

మీ ముక్కు పుడక పద్యం చదితితే, నాకే అసూయ వచ్చేసింది.. ఎంత బాగా రాసారో!!!!

ఊకదంపుడు చెప్పారు...

బాగుదండీ. అప్రకాశంబునన్ లో పకు ప వత్తుకూడా ఉండాలేమో
ఇంతకీ యే ఛందమండీ

ఊకదంపుడు చెప్పారు...

భలేప: భలే పద్యం

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును