9, ఫిబ్రవరి 2009, సోమవారం

రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు - ఫిబ్రవరి 14-16, హైదరాబాదు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు రెండవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుని
Feb 14-16,2009

మధ్య శ్రీత్యాగరాయగానసభ, చిక్కడపల్లి, హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. కొన్ని ముఖ్యవివరాలు:

మొదటిరోజు (నిర్వహణ: డా|| వంగూరి చిట్టెన్ రాజు) ఉ: 9.30 నుంచి
  • ఇంద్రగంటి శ్రీకాంతశర్మ స్వాగతోపన్యాసం
  • సి.నా.రె ప్రారంభోపన్యాసం
  • తెలుగు ఉపాధ్యాయులకు సన్మానములు (గ్రహీతలు: డా|| తెన్నెటి సుధాదేవి, ఆలూరు శిరోమణి, ఇంద్రగ్ంటి అన్నపూర్ణ)
  • డా|| ఆవుల మంజులత, గొల్లపూడి మారుతీరావు ల ప్రసంగాలు
  • పుస్తకావిష్కరణలు
  • తెలుగు వివిధ దశలు-ఉద్యమాలు పై పోరంకి దక్షిణామ్మూర్తి, విహారి, వల్లావజ్జుల పతంజలి శాస్త్రి, జె. బాపురెడ్డి, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ ల ప్రసంగాలు
  • లలిత సంగీతం ( ప్రత్యేక ఆహ్వానితులు వింజమూరి అనసూయాదేవి) సా: 7.00 గంటలకు

రెండవరోజు: (నిర్వహణ: ఇంద్రగంటి జానకీబాల) ఉ: 9.30 నుంచి
  • ముఖ్యాతిధులు ( అబ్బూరి చాయాదేవి, మల్లది సుబ్బమ్మ, వాసా ప్రభావతి, సి. ఆనందారామం
  • వంద సంవత్సరాల తెలుగు సాహిత్య ప్రస్థానంలో రచయిత్రులు, స్త్రీల సాహిత్యంలో వాదనలు, రచనల్లో కుటుంబం-సంఘం-స్త్రీల సమస్యలు
  • సా 6.00 లకు రామాయణంలో స్త్రీపాత్రలలో అంతరంగ నివేదనం (కౌసల్య, శబరి, కైక, సీత మొదలగు పాత్రల సంభాషణ, నాటికలాంటిది)
మూడవరోజు: సా: 6.00 నుంచి
  • మాధ్యమాలలో తెలుగు సాహిత్యం: సినీ రచయితల వేదిక (బలభద్రపాత్రుని రమణి, గొల్లపూడి, పరుచూరి గోపాలకృష్ణ, చంద్రబోసు, అందెశ్రీ, s.v.రామారావు, వడ్డేపల్లి కృష్ణ
  • ముగింపు: శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి జీవిత సాఫల్య పురస్కారం

పూర్తి వివరాల కొరకు:
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
Vamsee International Campus
Satyasaipuram, Kuntloor(V),
Hayatnagar(M)
R.R. (Dist.)
Hyderabad, 501 505, AP
Cell: 98490 23852
email: ramarajuvamsee AT yahoo.co.in

brochure చూడండి

తెలుగుసాహిత్యాభిమానులు, ఔత్సాహిక రచయితలు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ...

2 కామెంట్‌లు:

asankhya చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధవళ కులాబ్ధి సంభవ! లసద్గుణ పూర్ణుడ! సోమ శేఖరా!
చక్కని కార్యక్రమాన్ని గూర్చి ముందుగా తెలియజేసిన మీకు నా ధన్యవాదాలు.
ఉగాది అంతర్జాల కవిసమ్మేళనంలో తప్పక పాల్గొనగలరని ఆశిస్తున్నాను.ఈ విషయంలో కొత్తపాళీగారిని సంప్రదించ్ గలరు.
కాదనుకొంటే నేను ఆ వివరాలివ్వగలను.
భవదీయుడు.
చింతా రామ కృష్ణా రావు.

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును