సినీమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినీమా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఆగస్టు 2010, ఆదివారం

నెలనెలా వెన్నెల్లో జె.వి.రమణమూర్తి గారి మెరుపు

ఈ నెల "హ్యూస్టన్ లో నెలనెలా వెన్నెల"లో జె.వి. రమణమూర్తి గారు ప్రత్యేక వక్తగా పాల్గొన్నారు. వింజమూరి అనసూయ గారు కూడా పాల్గొన్నారు.

రమణమూర్తిగారి -కంచు కంఠం, స్ఫురద్రూపం, స్పష్టమైన ఉఛ్ఛారణ, అన్నిటికీ మించి, నాటకం పట్ల ప్రేమ - ఆయన్ని రంగస్థలం పై అత్య్త్తమనటుడిగా తీర్చిదిద్దాయనడంలో సందేహంలేదు. అసలు నటన అంటే నిర్వచనం ఆయన మాటల్లో - acting is the art of listening. అలాగే దర్శకుడు అంటే - expert audience. సినిమాకి, నాటకానికి ఉన్నతేడా, సినిమాలో దర్శకుడి పాత్రఏంటి -ఇంకా ఎన్నో విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు.

మరి కన్యాశుల్కం గురించి ప్రత్యేకంగా చెప్పఖ్ఖరేదు - అది ఆయన ఊపిరి. దూరదర్శన్ వారి కోసం కన్యాశుల్కం - మొత్తం 19 భాగాలు -నిర్మించారు. . ఈ version లో ఆయన గిరీశాన్ని చివర్లో పరివర్తన చెందిన వాడిగా మలిచేరు. ఇదే విషయాన్ని ఒక ప్రేక్షకుడు (సుదేష్) అడుగుతూ - "అప్పారావు గారికి మాత్రమే పాత్రని, కథని మార్చే హక్కు ఉంది. మీ వివరణ ఏంటి" అన్నందుకు, దాదాపు అరగంటపైన ఆ ఒక్క విషయంమీదే మాట్లాడుతూ -
అప్పారావు గారు అప్పటి సాంఘిక పరిస్థుతలకి కొంచం తలవంచుతూనే - damn it కథ అడ్డం తిరిగింది - అంటూ పాత్రని సంశయంలో పడవెయ్యాల్సి వచ్చింది
అంటూ అసలు కన్యాశుల్కం రాయడానికి ప్రేరేపించిన వాతావరణం గూర్చికూడా వివరించారు. నాటకంలోని పాత్రలని ఉటంకిస్తున్నప్పుడు నాటకం చూసిన అనుభూతి కలిగింది.
వారికినా పద్యకుసుమాంజలి:
ఉ||
జొన్నలగడ్డయన్ననది ఉజ్వలతారలబింబరూపమౌ
వెన్నెలగడ్డయే. కలడె వేరె గిరీశము కావ్యకన్యకా
వన్నియతెచ్చినట్టునిల? వ్యంగ్యము, రౌద్రము, మోహనమ్మువం
టన్నిరసమ్ములన్ గనెడి ఢాకిని ఢంకము దద్దరిల్లదా?

ఒక్క నాటకం గిరించే కాకుండా సినిమా విశేషాలు కూడా పంచుకున్నారు. ఆయన మొదటిసారి NTR ని కలవడం కోసం, సెట్ లోకి వెళ్తే, ఎదో షూటింగ్ మధ్యలో ఉన్న NTR షూటింగ్ ఆపి - "బ్రదర్, మీరు నన్ను క్షమించాలి. మీ పాత్ర (గిరీశం) ని నేను వెయ్యాల్సి వచ్చింది...."అంటూ కరచాలనం చేసి పరిచయం చేసుకున్నారుట. ఇలా ఎన్నో. కార్యక్రమం అయిపోయిన తరువాత ఒక ప్రేక్షకుడి (రవి) స్పందన ఇలా ఉంది:

I came to the program with total focus on food. I was very hungry when I arrived wanting to eat immediately but I completely forgot about it as the program started unfolding. The evening turned out to be another real vennela. I really liked the answers from him. His answers are almost like a presentation of a thesis. He can be easily awarded a doctorate on Kanya Sulkam. His subject matter expertize impressed me. I never read any books all my life. Many friends asked me either read or watch Kanya Sulkam but I did not unfortunately (fortunately now?).

I feel that I am very blessed in many ways and listening about the Kanya Sulkam from the original Gireesam (patent owner?) is one of those fortunes. His narration or analysis of the writer's perspective with all possible permutation that are required in all the characters is a well thought out and structured observations. I found him very scientifically entertaining.

I am very fortunate to come across great teachers all my life as all my teachers since my childhood always understood me and did their best to expand or clarify on my questions. I found one such teacher in him. His observation are very genuine and authentic in nature. He did not even miss to share his thoughts on SWAASA n DHYAASA which really impressed me. His remarks on DHYAAASA (mind and its tricky nature) seemed like passing remarks and silly or lighter side of the discussion but it sounded like the essence of his life. In fact he shared a great secret with us in a very casual manner.

His very well structured ( like SQL) presentation on the issues of those times and the evolution of Kanya Sulkam seemed like a dissertation. His talk not only covered his career but also his spiritual perceptions too. I somehow felt he is very simple and honest to the best of his ability. I found one more great teacher in him. I am a product of many great teachers and good bosses. n short it is a great learning experience for me personally. I will watch Kanya Sulakam.

The best part of this great man is he came without expecting anything from the crowd. He did not come to sell, market his products or any prospective ambitions and did not have any worries that somebody would steal his ideas. This aspect highlights his contentment which is career and personal life.

I met a great person.

వింజమూరి అనసూయగారు కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఇదే సంధర్భంలో - సాహితీ-ప్రియుడు బ్లాగర్ సేకరించిన అరుదైన కృష్ణశాస్త్రి గారి ప్రసంగం గురించి వంగూరి చెట్టెన్ రాజు గారు ప్రస్తావించారు. ఆ సభలో అనసూయగారు ప్రారంభగీతం పాడేరుట. "జయ జయ ప్రియభారత.." పాట గురించి చెబుతూ, ఈ పాటకి తనే స్వరకల్పన (ఇళయరాజా కాదు) చేసాననీ కూడా చెప్పారు. 91 ఏళ్ళవయస్సులో ఆవిడా తన మూడవ పుస్తకం - ఎందరో మహానుభావులు - రాసేపనిలో ఉన్నట్టు చెప్పారు.
వారికినా పద్యకుసుమాంజలి:
ఆ.వె||
కృష్ణశాస్త్రి కైత కృతులబాసలు నేర్పు,
వింజమూరి గురుతుదొంతర వింజామర విసరా
స్వరఝరీలలామ సౌరభం గ్రోలగ
మనసున మల్లెల మాలలూగెన్ నా మదిన్ అహా!
ఈ వెన్నెల వీడియో లభించినప్పుడు లింక్ పోస్ట్ చేస్తాను.

ఇదేనండి ఇదేనండి భాగ్యనగరము - తెరవెనుక పాట

జె.వి. రమణమూర్తి గారు "కన్యాశుల్కం" నాటికాన్ని (ఇప్పటికీ) ఒక యజ్ఞం లా నిర్వహిస్తున్న సోమయాజి. రంగస్థలంపై ఆయన అనుభవం 64 సంవత్సరాలు. ఆయన్ని "హ్యూస్టన్ లో నెలనెలావెన్నెల" లో భాగంగా కలిసే అదృష్టం కలిగింది. ఆయన తన సినీ రంగ ప్రవేశం గురించి వివరిస్తూ*
"....నా సినిమా ప్రవేశానికి ప్రధానకారణం "కాళరాత్రి" అనే నాటకం. ఈ నాటక ప్రదర్శనని హైదరాబాదులో చూసిన కొంతమంది సినీ ప్రముఖులు, నన్ను సినిమాల్లో ప్రయత్నించ వలసింది గా కోరారు. అలా ఎల్.వి. ప్రసాద్ గారు మొదటి సినిమా కోసం పిలిచినా, వారి మేనల్లుడు తిలక్ దర్శకత్వంలోనే మొదట నటించే అవకాశం వచ్చింది. అదే ఎమ్.ఎల్.ఏ చిత్రం. అవుట్ డోర్ చిత్రీకరణకోసం చిత్రబృందం కాశ్మీర్ అని, ఊటీ అని, తర్జన భర్జనలు పడుతుండగా, మీకు హైదరాబాద్ అనే ఊరుంది తెలుసా అనేసరికి, సభ్యులందరూ కాసేపు విస్తుపోయి -నిజమే కదూ అనుకుంటూ - అవుట్ డోర్ కోసం హైదరాబాద్ ని ఎన్నుకున్నారు. అప్పట్లో హైదరాబాదు ఎంతో రమణీయంగా ఉండేది. ఇక్కడి ప్రతీ వీధి, ఢిల్లీ పార్లమెంట్ రోడ్ అంత సుందరంగా ఉండేది.....

.. ఏ ప్రదేశం చూసినా సుందరంగా ఉండడం వలన, అలా నాలుగు కార్లలో వెళ్ళి, ఎక్కడంటే అక్కడ ఆగి, కావాల్సిన సీన్స్ - అనుకున్నవి, అనుకోనివి - తీసుకునేవాళ్లం. ఇవన్నీ ఎందుకయ్యా అని తిలక్ ని అడిగితే, చెప్తానుండు అని వాటిని ఒక 600 అడుగులకి కుదించి, కూర్చి, ఆరుద్ర గారిని పిలిచి ఈ దృశ్యమాలిక కి సరిపోయేవిధంగా ఒక పాటరాయమన్నారు. ఆవిధంగా ఇదేనండి, ఇదేనండి భాగ్యనగరము పాట పుట్టింది...."
అంటూ మరెన్నో విషయాల గురించి కూడా మాట్లాడారు. వీడియో లభ్యమైనప్పుడు లింక్ పోస్ట్ చేస్తాను.
చిక్కగా రాసే ఒక కలం కూడా ఇదేనండి, ఇదేనండి భాగ్యనగరము పాటపై ఒక ఊహాగానం చేసింది. విని ఆనందించండి.

* భావం మాత్రమే. యథాతథం కాదు.

18, ఆగస్టు 2010, బుధవారం

కీర్వాణెవరయ్యా? హింసకు హేతువయా (అందరి బంధువయా పాటకి పేరడి)

ఈ మధ్య సంగీత దర్శకులు వాళ్ళ సినిమాల్లో టైటిల్ సాంగా, ఐటం సాంగా అన్న తేడాల్లేకుండా అన్నిపాటలు పాడేసి శ్రోతలని తెగ విసిగించెస్తున్నారు. అందులో అగ్రస్థానం కీరవాణిది. తరువాత, చక్రి, హీమేష్ మొదలైనవారు. వీళ్ళని - స్వరకర్తలు, స్వతహా పాటగాళ్ళు అయిన, ఘంటశాల, రాజేశ్వరరావు, ఇళయరాజా, రెహ్మాన్ - లతో పోలుస్తూ, సరదాకి అందరి బంధువయా టైటిల్ సాంగ్ - సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా కి పేరడి (అసలుపాట నలుపురంగులోను, పేరడీ నీలంరంగులోనూ ఉంచబడ్డాయి) గా ఒక పాట.


సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా.
సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా.

ఘంట్సా లెవరయ్యా, గన గంధర్వుడేనయ్యా!
రాజేశ్వరు డెవరయ్యా, స్వరబ్రహ్మే కదవయ్యా.

ఇళైరాజెవరయ్యా, ఇసైజ్ఞానే పదవయ్యా.
రెహ్మానెవరయ్యా, మన అందరి బంధువయా.

(గనగంధర్వుడయా -గాన గంధర్వుడయా లేదా ఘన గంధర్వుడయాకి శబ్దరూపాంతరం)

నేలనింగినీరూనిప్పూ, నిలువనిచ్చేగాలీ
తమతమ స్వార్ధం చూసుకుంటే, మన గతి ఏం కావాలి
కొంచెం పంచవయా, నువ్వు అందరి బంధువయా
మంచిని పెంచవయా, నువ్వు అందరి బంధువయా

ఘంటశాలిళైరాజ్ రాజేశ్వరుడు,
తమతమ స్వార్ధం చూసుకునుంటే, మీ గతి ఏమయ్యేదో?
కొంచెం ఆపరయా, మిరు హింసకు హేతువయా
పాటను పంచరయా, మరి అందరి బంధువవా


జగతికి ప్రేమను పంచుటకోసం, శిల్వను ఎక్కిన జీసస్
సత్యంకోసం విషంతాగి, సందేశం ఇచ్చిన సొక్రటీస్
అహింసయే తన గొప్ప ఆయుధం, అనినిరూపించిన గాంధి
తమకు ఎప్పుడు ఏమీ కాని, జనం కోసమే తపించి
సుఖాలు త్యజించి, మహాత్ములై నిలిచారు
వీరంతా ఎవరయ్యా, మనలాగే మనుషులయా!

జగతికి పాటను పంచుటకోసం, తప్పుకున్న ఇళయరాజు
ప్రతిభను పెంచుటకోసం, కొత్తవారిని తెచ్చిన రెహ్మాన్

భిన్నత చాటుటకోసం, ఎంతొమందిని మెచ్చుకున్న మహదేవుడే

తమకు ఎప్పుడు ఏమీ కాని, జనం కోసమే తపించి

స్వరాలు త్యజించి, మహాత్ములై నిలిచారు.

వీరంతా ఎవరయ్యా, మీలాగే స్వరకర్తలయా!

కీర్వాణెవరయా, మన హింసకు మూలమయా
కొంచం ఆపవయా, బాలూ ఏడ్చునయా

చక్రీ ఎవరెయ్యా, మన హింసకు హేతువయా

కీచ్వాణాపవయా, చెవిలో రక్తం వచ్చునయా

హేమేషె వరెయ్యా, మన హింసకు హేతువయా

టోపీ తీయవయ్యా, భువిలో యద్ధం వచ్చునయా.


సూర్యుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా
చంద్రుడు ఎవరయ్యా, మన అందరి బంధువయా.

ఘంట్సా లెవరయా, మన అందరి బంధువయా
రెహ్మానెవరయ్యా, మన అందరి బంధువయా.

21, మార్చి 2009, శనివారం

రేయి మించెనోయీ రాజా (పేరడీ video)

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ .....హాయిగ నిదురించరా

వెన్నెల్లు విరెసె, వెతలెల్ల వెలిసె
ఆశల తారలు మిలమిల మెరిసె

తలపుల్లో నీవు, జలకమ్ములాడి
విందారగింపా విచ్చేయవోయి
మమతల్లు కలుపు, మాయల్లు విరుపు
దూరాలు తరగు, మురిపాలు పెరుగు
హాయిగ నీవింక సేవించవోయీ

రేయి ||

సిరులూ, విరులూ, మనకేలనోయి,
రాగం, అనురాగం మనవేకదోయి

కన్నుల్లు మూసి, మనసే తెరచి
కలలేకంటూ విహరించవోయీ
హార్ధికమాంద్యం కలలకుకాదు
కలలకు కొఱతంటు రానేరాదు
హాయిగ నీవింక శయనించవోయి

రేయి మించెనోయీ రాజా,
హాయిగ నిదురించరా, ఆ .....హాయిగ నిదురించరా
ఉమ్.....ఊమ్..... ఊ....ఊ.......


ఈపాట వీడియో రూపంలో ఇక్కడ చూడండి



రచన: దీపిక ఆచళ్ళ, సోమశేఖర్ ధవళ
గాత్రం: దీపిక ఆచళ్ళ
స్వరకల్పన: ఘంటసాల
మాతృక రచన: సముద్రాల
చిత్రం: శభాష్ రాముడు


నేపధ్యం:
నేను, దీపిక (మా ఆవిడ) కలిసి సాయంత్రం "నడక" కని బయలుదేరాం (ఇలా వాకింగ్ కి వెళ్ళడం, జీవితంలో నాకు ఇదే మొదటిసారి). కాస్త దూరం నడిచిన తరువాత, ఏదైనా పాటపాడొచ్చు కదా అని దీపికని ఆడిగాను. సరే అయితే, మీకిష్టమైన "శభాష్ రాముడు" లోని "రేయి మించెనోయి రాజా" పాడతాను అని మొదలుపెట్టాకా, ఇంక ఆపాటకి పారడి మొదలుపెట్టాను (నాకు అంత్యాక్షరీల్లో, ఇలా పాటలని ఖూనీ చెయ్యడం బాగా అలవాటూ). అది ఇలా మొదలయ్యింది

"అలసి సొలసి, ఆయాసం వచ్చి,
త్వరగా ఇంటికి పోదామురండి" అని మాఆవిడ అంటే


"పోపే పోచి, చారే కాచి
వేడిగా ముద్దే తిందాము రండి" అని నేను,

ఇలా కామెడీగా మొదలయ్యి, పైన రాసిన విధంగా రూపాంతరం చెందింది.

28, ఫిబ్రవరి 2009, శనివారం

మన గురివిందగింజ నలుపే సుమా!

స్లమ్ డాగ్ మిలియనీర్ (SM). దీని మీద జరుగుతున్న చర్చ ఇంతా అంతా కాదు. మచ్చుకి కొన్ని

కౌముదిలో గొల్లపూడిగారు
దానిపై వారి వివరణ
*** వాళ్ళకి లేవా మనోభావాలు (నవతరంగం)
*** రావు గారి వువాచ (e-కలం)
విజయేంద్రవర్మ -SM (జీడిపప్పు)
ఎందుకు అన్నిఅవార్డులు (జీడిపప్పు)
మురికివాడల *** (గుంపులోగోవిందం)
మురికివాడల *** (అబ్రకదబ్ర)
*** మీ గురివిందగింజ తెలుపా **? (అంతర్యానం)
సైమన్ బఫాయ్ (స్వంత మాటల్లొ)

వాటిలో వచ్చిన కామెంట్లుతో కలిపిచూస్తే ... ఈ సినిమా మీద విమర్శలకన్నా, దీన్ని విమర్శించినవాళ్ళ మీద విమర్శలే తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మనతెలుగువారైన "గొల్లపూడి" గారి మీద.

ముందు సినిమా గురించి నా అభిప్రాయం (నవతరంగంలొ చెప్పిన విషయాన్ని ఇక్కడ కొంచం విశదీకరించి రాస్తున్నాను). సినిమాని సమీక్షించే ముందు, దాన్ని మూడు భాగాలుగా చేద్దాం.
1) taking/making (కధనం, సాంకేతిక విలువలు, ప్రయత్నం, పడ్డ కష్టాలు వగైరా)
2) presentation (ప్రచారం, సమర్పించిన విధానం)
౩) content (కథ)

taking/making విషయానికి వస్తే, నాకు చాలా నచ్చిన సినిమా. ఉదాహరణకి, సినిమా మొదట్లో మురికివాడల్లోని chasing scene. వెనకాల డప్పులు మ్రోగుతుంటే, కదనరంగంలో సైనికులవీరంగం మల్లే ఉంది. సైమన్ బఫాయ్ వ్యాసం చదివితే దీని నేపధ్యం అర్ధమవుతుంది. సినిమా ఆద్యంతం పట్టుసడలకుండా intense గా సాగుతుంది. మురికివాడల, ధనికవర్గాలవారి జీవినవిధానంలోని వ్యత్యాసము చూపడంలో దర్శక-సాంకేతికనిపుణులు కృతకుత్యులయ్యారు. నేపధ్యసంగీతం, చాయాగ్రహణం మొదలైనవి సినిమా విజయవంతమవ్వడనికి దోహదపడ్డయి. Curious case of Benjamin Button తో పోలిస్తే, దీనిక Oscars రావడంలో వింతేమీ లేదు. అందుకు, దర్శక-నిర్మాతలకీ, సాంకేతికవర్గానికి అభినందనలు.

సినిమా Title ని ఎన్నుకోవడంలోనే నిర్మాతల (లేదా/మరియు దానికి భాద్యులైన వారి) వ్యాపారాత్మక ప్రతిభ కనబడుతుంది. భారతదేశం, పేదరికం, ప్రేమ, ఆశ, మొక్కవోని ఆత్మవిశ్వాసం, డబ్బు. వీటిని Q&A అనే రుబ్బురోలు లోవేసి రుబ్బండి, అలా వచ్చిన కాకా హోటలు పచ్చడిని, ఎదురుకుండాఉన్న అయిదునక్షత్రాల హోటలులో ఆరగించండి. బ్రేవ్ మని త్రేన్చుతూ, పొట్టనిమురుకొనేట్లుగా చెయ్యడంలో వారి ప్రతిభ మరోసారి కనబడుతుంది. దీన్నుంచి మనవాళ్ళు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది.

ఇక చివరిగా, కథగురించి. ఎంతోమంది అనుకొంటున్నట్టుగా ఇదొక ఆశావహుడైన ఒక మురికివాడజీవి ప్రయాణంలా నాకస్సలు అనిపించలేదు. చిన్నతనంలో, జమాల్, అతను స్నేహితులు, ఆశావాదులుగా కాదు, అవకాశవాదులుగా కనబడ్డారు. దీనికి నా చిన్నప్పుడు జరిన ఒకసంఘటన చెప్తాను. నాకప్పుడు ఒక 5-6 ఏళ్ళు ఉంటాయి. కాబోలు . మా ఇంటికి ఒక రెండువీధులవెనక కొంచం మురుకివాడల్ని పోలిన గడపలు ఉండేవి. రధాయాత్రరోజులు అనుకుంటా, ఒక గాలిపటం పావలాపెట్టి కొనుక్కుని, ఇంటిముందు వీధిలో, దానికిదారంకట్టి ఎగరెయ్యడానికి నానా అవస్థపడుతుంటే, నాఅంతవయసే ఉన్న మరో కుఱ్ఱాడు, నువ్వు దారం పట్టుకో, నేను గాలిపటంపట్టుకొని, పరిగెడతాను అప్పుడు ఎగురుతుంది అనిసంజ్ఞలతోనే చెప్పి, కాసేపు పరిగెట్టి, దారంతెంచి, గాలిపటంపట్టుకొని పారిపోయి ఆ మురికివాడాలో తేలాడు. కాసేపు నేను చేష్టలుడిగి అలా ఉండిపోయాను. ఆ కుఱ్ఱాడి ప్రతిరూపమే నాకు ఈ జమాల్ & కో లో కనిపించింది. ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల మంచిదే! ఒక పావలా సంపాదించి గాలిపటంకొనుక్కొని ఎగరెయ్యడం, అభినందనీయం. గాలిపటంలాక్కుని పొందటం అభిశంసనీయం. SM లో నాకు గోచరించినది రెండోదే!

ఒక్కసారి chasing scene ని జ్ఞప్తికి తెచ్చుకుంటే: సముద్రంలోని అలలు మైలు దూరంనుంచి మొదలయ్యి, తమతో భూమండలాన్ని మింగడనికా అన్నట్లు, ఒకదాని వెంట ఒకటి తరుముకుంటూ వస్తాయి. కానీ కబళించడం తమవల్ల సాధ్యంకాదూ అని తెలిసికాబోలు, ఒడ్డుని ధబ్బుమనిఢీకొని మరొకసారి నీ పనిపడాతానని ఉస్సూరుమంటూ వెనుదిరుగుతాయి. ఆ పోలీసు పర్సిస్థితీ అంతే! ఒక అయిదు నిముషాలు chase చేసినా ప్రయోజనం ఉండదని తెలుసు. కానీ chase చేస్తాడు. chasing scene అధ్బుతంగా తెరెకెక్కించారు. action సరే! మరి దానికి ముగింపేదీ. ఇక్కడే నాకు దర్శకుడి intention మీద అపనమ్మకం కలిగింది. అవకాశవాదం/మురికివాడాల మలినాన్ని destiny,/hope అనే wrapper లో చుట్టిఇచ్చినట్టుగా ఉంది. ఇంక జమాల్ ప్రేమ వయహారమా! బాలీవుడ్ సినిమాలు చూసి, చూసి, రవ్వంతకూడా ఆశ్వాదించలేదు.

అందుకే నా దృష్టిలో ఇది
మామూలు సినిమాల్లో గొప్పసినిమా గొప్పసినిమాల్లో మామూలు సినిమా
ఇక విమర్శలగురించి: చాలావరకు వస్తున్న విమర్శలు కధగురించి, దాన్ని చూపించిన విధానం గురించి. అసలు పేదరికాన్ని చూపించాలా వద్దా, చూపిస్తే ఎలే చూపించాలి. పెంట కుప్పలో ములగాలా? అఖ్ఖర్లేదా? ఇత్యాదులు. సినిమా మాధ్యమంలోని చిత్రమేమిటంటే, చూసిన/చూడని ప్రతీఒక్కడు, ఇలా తియ్యాలి, ఇలాగే తియ్యాలి అనుక్కోవడం (తీసిన అనుభవం ఉన్నా లేకున్నా, సాదకబాధకాలు తెలిసినా తెలియకున్నా), అదే సరియనది అని నమ్మడం. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఒకే సన్నివేసాన్ని చూసి, సంధర్బం బట్టి, ఒకే వ్యక్తి పలు రకాలుగా స్పందిస్తాడు. మరి పలు వ్యక్తులు రకాలుగా స్పందించడంలో ఆశ్చర్యమేముంది. విమర్శకులందరూ విచిత్రంగా దీన్ని విస్మరిస్తారు. ఇదేమి లెఖ్కలు కాదు కదా 1+1 = 2 అని ఋజువుచెయ్యాడానికి. ఇక్కడే సినిమాని విమర్శించిన వాళ్ళు, సమర్ధించిన వాళ్ళు విభేదిస్తున్నారు అని నా అభిప్రాయం.

ఇకగొల్లపూడి విమర్శ, దానిపై విమర్శల విషయానికివస్తే:

నాకు ఆయన విశ్లేషణ చాలా సమంజసంగా కనిపంచింది. మొదట ఆయన "నాకు కళ అంటే ఫలానా, ఫలానా. నేను ఇలా నిర్వచిస్తాను. ఏ విధంగా ఉండాలి, ఉండకూడదు" అని ఒక సిద్ధాంతమేదో ప్రతిపాదించేరు. కొన్ని ఉదాహరణలు ఇచ్చేరు. దానికి లోబడి, SM లేదు. కాబట్టి నాకు నచ్చలేదు. అందుకే నేను చూడను అన్నారు. ఇందులో తప్పేంటి?

నేను దశాంశమానంలోంచి చూశాను 1+1 =0 కాబట్టి తప్పు అని రావు గారు అంటే, అయ్యా మీకు బుర్ర లేదండీ, మీ మూర్ఖత్వంకాకపోతేనూ, నేను పెట్టుకున్న radix-2 కళ్ళజోడు పెట్టుకొని చూడండి, 1+1=0 సరియేను అంటే? ఇక్కడా ఎవరి కళ్ళాజోళ్ళు వాళ్ళవి! ఒకళి జోళ్ళు ఒకరికి నప్పవు మరి.

ఒకరు, "అసలు మీరు కళకి ఎలా నిర్వచనం ఇస్తారు. ఏ సూత్రం లేకపోవడమే అసలైన సూత్రం," అంటారు. వినడానికి ఇది చాలా బావుంది. కొంతమేర నిజమే కూడా. నా దృష్టిలో అర్ధవంతమైన వాదన. కాని, కాంతికన్నా వేగంగా ప్రయాణించి, నక్షత్రాలకావల పాలపుంతలవింతలు చూసిరావడం ఎంత ఆచరణ యోగ్యమో, ఏ సూత్రమూ లేకుండా సినిమా నిర్మించడమూ, అంతే ఆచరణయోగ్యం. ఎంత కళాకారుడైన, సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని వ్యాపారాత్మక ప్రపంచంలో అనుభవించలేడు.

వీటన్నికి మించి, అసలు ఆయన సినిమానే చూడలేదు. ఆయనకి విమర్శించే హక్కు ఎక్కడిది అని కొందరు. నేను చూసిన జనాలలో, ఎక్కువమంది, ఇదే విషయం పదే పదే ప్రస్తావించారు. అందుకు వాడిన కొన్ని పదాలు:

చెప్పుడు మాటలు విని, ఎవరో చెప్తే, విని, మూర్ఖత్వం, మట్టి మషాణం, మొదలైనవి
అలా ఆడిగిన వాళ్ళందరు గమనించాల్సింది, అక్కడ చెప్పింది కొడుకు, విన్నది తండ్రి. కొడుకు, "నాన్నా సినిమా బావులేదు, ఇదిగో ఇలా చూపించారు, ఇలా ఉంది" అంటే, ఆ తండ్రి, కొడుకు మాటలు విశ్వసించకూడదా? ఆదే రంగంలో ఉన్న తండ్రి ఆ విషయాన్ని గ్రహించలేరా? పోనీ మనకా విషయం తెలియనప్పుడు, సంశయనివృత్తి కోరవచ్చునుకదా! కోరలేని పక్షంలో సంయమనం పాటించవచ్చుకదా?

అసలు వాళ్ళబ్బాయి, సినిమా హాల్లొ సినిమా చూడాలేదు, DVD లో చూసాట్ట. piracy కాదూ!
మీరు ముసిలివారైపొయారు ఇంక విశ్రాంతి తీసుకోండీ
మీరు మీ అబ్బాయి పేరు మీద నెలకొల్పిన award ని వనజ కి ఇచ్చారు, అందులో ఇంకా జుగుప్సకరమైన ఘటనలున్నాయి. దానికిలేని అభ్యంతరం దీనికెందుకు? ఫలానా సినిమాలో ఇలాంటి పాత్రవేసారే? మీరూ విమర్శించేవాళ్ళేనా!
ఇవన్నీ కాదుగానీ, అసలు సినిమా తీసినవాడు విదేశీయుడండి, అందుకేనండీ మీ ఆక్రోశం, ఆవేదనానూ!
మనదేశీయుడు తీసిన సినిమాలో ఇంకా జుగుప్సాకరమైన ఘతనలు ఉన్నాయి. వాటిని ఎందుకు విమర్శించలేదు?
మీ విమర్శ, దర్శక-నిర్మాతల విజ్ఞతని కించపరిచేదిగా ఉందండీ!
అసలు విమర్శించే అర్హత మీకు లేదండీ!

ఇవి మరికొంతమంది వ్యక్తపరచిన (యధాతధం కాకపోయినా,భావం మాత్రం అదే) అభ్యంతరాలు. ఎంతసంధర్భోచితంగా ఉన్నాయో అవి మీ విజ్ఞ్తతకే వదిలేస్తున్నాను.

ఒక్క కొత్తపాళీ గారు మాత్రం "అభిరుచుల విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. కాదనను. వేరే దృక్పథాన్ని మీతో పంచుకోవాలని మాత్రమే ఈ జాబు, పెద్దలతో వాదంఇచాలని కాదు" అంటూ హుందాగా వ్యవహరించేరు/విభేదించేరు.

మనం ఆచరించలేని, అనుసరించలేని పరిపూర్ణస్వచ్చతని, అవతలి వ్యక్తిలో ఉండాలనుకోవడం, మనగురివిందగింజలోలేనితెలుపు అవతలి వ్యక్తిలో ఉండాలి అనుకోవడమే!

చివరిగా

"దీని [SM] దెబ్బకి రేపు రోడ్లమీద అమెరికన్లు నన్నేదో చులకనగా చూస్తారనుకునే న్యూనతా భావం నాకు లేదు. ఒక వేళ వాళ్లలా చూసినా, who cares? " అని అనగలిగిన ఆత్మవిశ్వాసం

"I am entitled to my space to differ" అన్న గొల్లపూడి గారి అభిప్రాయాన్ని, దాంతో పాటు మన విజ్ఞ్తతని, వివేవచని మ్రింగేసే అహంకారం/అహంభావం గా మారకూడదనే నేను కోరుకునేది!

గమనిక: అసలు నాకు పైన ప్రస్తావించబడిన బ్లాగర్లు పరిచయంలేదు. అలాగే గొల్లపూడి గారు కూడా. నిష్పాక్షికంగానే వ్యవహరించానని అనుకుంటున్నా. కొన్ని టపాలని verbatim quote చేసినా, అది వ్యక్తిగతంకాదని, సాధారణ భావజాలానికి ప్రాతిపదికగా మాత్రమే వాడ్డం జరిగిందని మనవి (అందుకే పేర్లు ఉటంకించలేదు). ఎంతోమంది కామెంట్లని ప్రస్తావించేను. అందరిని పేరు పేరునా quote చెయ్యడానికి బద్దకం :)


మరోగమనిక: ఒకొక్కసారి, అసలు ఈ వాదనలలో అర్ధమేలేదనిపిస్తుంది. రాద్దాం అనుకుంటూ, మనం చెప్పేది మనకే వర్తిస్తుంది కదా అని మానేస్తాను (circular reasoning). SM విషయంలో కూడా అనుకుంటుండగానే,
దూల ఎక్కువై,
ఇదిగో ఇగోల గోల
ఈలోగా
ఇలాగ :)

27, డిసెంబర్ 2008, శనివారం

మహామంత్రి తిమ్మరుసు : చిత్రసీమయందు నీవె లెస్స

"వీర రక్తమును ఉడుకెత్తించే
విద్యానగర ప్రదాతకూ జై

ధరణిని కావగ దనుజులనణచిన
వరాహమూర్తికీ జై ..."

పప పపాం పప పపాం .... అంటూ బాకావాయిద్య నేపధ్య సంగీతంలో బుఱ్ఱకధతో మొదలవుతుంది "పౌరాణిక బ్రహ్మ" కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలోని "మహామంత్రి తిమ్మరుసు".


పూర్తి వ్యాసం నవతరంగంలో ఇక్కడ చదవండి

స్వాగతం

సుస్వాగతం

ధన్యోస్మి

మరల వచ్చెదరని తలంతును